Begin typing your search above and press return to search.

వేల కోట్ల కంపెనీ.. అంబానీతో స్టార్‌ వైఫ్ భాగ‌స్వామ్యం!

మీరా రాజ్‌పుత్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందంతో ఫ్యాష‌న్ సెన్స్ తో ఈ భామ నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 Jun 2024 4:46 AM GMT
వేల కోట్ల కంపెనీ.. అంబానీతో స్టార్‌ వైఫ్ భాగ‌స్వామ్యం!
X

త‌న‌దైన అందం చందం ఫ్యాష‌న్ సెన్స్ తో కుర్ర‌కారు మ‌న‌సులు దోచిన ప్ర‌ముఖ స్టార్ హీరో వైఫ్ ఇప్పుడు ఏకంగా ముఖేష్ అంబానీ కుమార్తె తో క‌లిసి దాదాపు 8.40 కోట్ల కంపెనీ లో భాగ‌స్వామి కాబోతోంది. ఆ మేర‌కు డీల్ పై ఒప్పందం కుదిరింది. ఈ ఎపిసోడ్ లో స్టార్ వైఫ్ ఎవ‌రు? అంటే.. షాహిద్ క‌పూర్ భార్య మీరా రాజ్ పుత్.

మీరా రాజ్‌పుత్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందంతో ఫ్యాష‌న్ సెన్స్ తో ఈ భామ నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. అలాగే రిల‌య‌న్స్ అధినేత వార‌సురాలు ఇషా అంబానీకి అత్యంత స‌న్నిహితురాలు. ఇషాజీ ఇంత‌కుముందు ఆలియా భ‌ట్ తో క‌లిసి ప్ర‌ఖ్యాత దుస్తుల బ్రాండ్ కంపెనీని నిర్వ‌హ‌ణ‌కు ఒప్పందం కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ అవ‌కాశం మీరా రాజ్ పుత్ ని వ‌రించింది.

రిలయన్స్ రిటైల్ బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫాం `తీరా` నుంచి స్కిన్‌కేర్ బ్రాండ్ `అకిండ్`ను విడుదల చేస్తున్నట్లు ఇషా- మీరా అధికారికంగా ప్రకటించారు. వేల కోట్ల పెట్టుబ‌డులతో మొద‌ల‌వుతున్న ఈ కంపెనీకి షాహిద్ భార్య‌ మీరా కపూర్ సహ వ్య‌వ‌స్థాప‌కురాలిగా ఉంటుంది. అకింద్ బ్రాండ్ ను ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లోని తీరా ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో ఆవిష్కరించారు. ఈ బ్రాండ్ భారతదేశపు ప్రీమియం బ్యూటీ డెస్టినేషన్ అయిన తీరాలో ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. స్కిన్‌కేర్ బ్రాండ్ వ్యక్తులు తమ చర్మ సంరక్షణ లక్ష్యాలను సాధించడానికి స‌హ‌క‌రిస్తుంది. అకిండ్ శ్రేణిలోని ప్రతి ఫార్ములేషన్ ఒకరి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది మూడు విభిన్న మోడ‌ల్స్ లో ల‌భిస్తుంది. బిల్డ్ రేంజ్, ది బ్యాలెన్స్ రేంజ్, ది డిఫెన్స్ రేంజ్ అనే మూడు ర‌కాల ఉత్ప‌త్తుల‌ను మార్కెట్లో దించుతుంది.

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. సొంత బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోలో తీరా మొట్టమొదటి స్కిన్‌కేర్ బ్రాండ్ అకిండ్‌ని పరిచయం చేయడం సంతోషంగా ఉంది. తీరా ప్రయాణంలో ఈ ప్రయోగం ఒక ముఖ్యమైన మైలురాయిని అందుకుంటుంద‌ని అన్నారు. అకిండ్ సహ వ్యవస్థాపకురాలు మీరా కపూర్ మాట్లాడుతూ, ``చాలా కాలం క్రితం, నేను నా చర్మ సౌంద‌ర్యం గురించి వినడం ప్రారంభించినప్పుడు నా చర్మ సంరక్షణ ప్రయాణం నిజంగా ప్రారంభమైందని నేను గ్రహించాను. అకైండ్ శ్రేణిని జాగ్రత్తగా విస్తృతమైన పరిశోధనలతో రూపొందించిన‌ది. నిర్దిష్ట ఛ‌ర్మ‌ సమస్యలకు ప‌రిష్కారాన్ని ఇవ్వ‌గ‌ల‌దు`` అని అన్నారు. తీరా టూల్స్ విజయవంతంగా ప్రారంభించిన తర్వాత, రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (RRL) తన వినూత్న ఆఫర్లను విస్తరిస్తూనే ఉంది.