చుక్క లాంటి అమ్మాయితో పబ్లిగ్గా స్టార్ హీరో బ్రో షికార్లు
క్లబ్బు పబ్బు కాదేదీ ప్రేమాయణానికనర్హం అన్న చందంగా ఈ జంట షికార్లు చేసేస్తోంది.
By: Tupaki Desk | 19 Jan 2025 10:30 PM GMTలేగ కళ్లతో గుండె మీటుతోంది.. స్టార్ హీరో సోదరుడు అలా నీడలా తననే వెంటాడుతున్నాడు! ఇంతకీ ఎవరీ అమ్మాయి? అంతగా ఆ ఇద్దరి మధ్యా ఏం ఉంది? ఏమో..! ఈ జంట వ్యవహారం చూస్తుంటే చాలా జరుగుతోందని అర్థమవుతోంది. జంట బావుంది. చూడ ముచ్చటగా ఉంది. అలా కలిసి వెళుతుంటే ఇంకా ముచ్చటేస్తోంది.
క్లబ్బు పబ్బు కాదేదీ ప్రేమాయణానికనర్హం అన్న చందంగా ఈ జంట షికార్లు చేసేస్తోంది. గత కొంతకాలంగా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ ఒక అందమైన అమ్మాయితో షికార్లు చేస్తున్నాడంటూ ఒకటే ఠాంఠాం మోగుతోంది. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని అర్థమవుతోంది. ఏదేమైనా.. ఫేజ్ 3 ప్రపంచంలో ఇలాంటి ఎన్నో సన్నివేశాలను చూస్తూనే ఉంటాం. కొన్నిటిని చూసి వదిలేయాలి. మరి కొన్నిటిని చర్చించి వదిలేయాలి. మరీ అంతగా వారిని వెంబడించడం తగదు! అని నెటిజనులు సెలవిస్తున్నారు.
ఇంతకుముందు `ధడక్` చిత్రంతో ఆరంగేట్రం చేసిన క్రమంలో ఇషాన్ తన కథానాయిక జాన్వీ కపూర్ తో ప్రేమలో పడ్డాడని ప్రచారమైంది. అయితే ఈ జంట ఆ తర్వాత ఒకరికొకరు దూరమయ్యారు. కెరీర్ పరంగాను బిజీ అయిపోవడంతో ఇద్దరూ దూరమయ్యారు. ఆ తర్వాత ఖలీపిలీ టైమ్ లో అనన్య పాండేతోను ఇషాన్ ఖత్తర్ లవ్ లో పడ్డాడంటూ ప్రచారమైంది. అయితే అది కూడా కొన్నాళ్లకు బ్రేక్ అయింది. ఆ తర్వాత ఆచితూచి ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేని అందమైన ఫేజ్ 3 గాళ్ తో ఇషాన్ డేటింగ్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఈ ఇద్దరి మధ్యా ఇది ఇంకా ఎన్నాళ్లు? అన్నది ఇప్పుడే చెప్పలేం. వరుణ్ ధావన్ మాదిరిగా తన స్నేహితురాలిని పెళ్లాడి ఇషాన్ లైఫ్ లో సెటిలవుతాడా? అన్నది కూడా వేచి చూడాలి.
ఆ అమ్మాయి మోడల్?
షాన్ ఖట్టర్ మోడల్ చాందిని బైంజ్ తో డేటింగ్ చేస్తున్నట్లు కొంత కాలంగా పుకార్లు ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో వారిద్దరూ కలిసి ఫోటో దిగారు. మీడియాకు పోజు ఇవ్వడానికి ముందు చాందిని బైంజ్‌ను కారు వరకు తీసుకెళుతూ కెమెరాకు చిక్కాడు. ఆ తర్వాత పలుమార్లు ఇలా జంటగా దర్శనమిచ్చారు.