Begin typing your search above and press return to search.

వీడియో టాక్: రొమాన్స్ లో మునిగి తేలారుగా!

అటుపై 'పైట‌ర్' టీజ‌ర్ లో సైతం హృతిక్ రోష‌న్ తో దీపిక బికినీ రొమాన్స్ షార్ట్ అంతే ఆస‌క్తిక‌రంగా మారింది

By:  Tupaki Desk   |   22 Dec 2023 12:26 PM GMT
వీడియో టాక్: రొమాన్స్ లో మునిగి తేలారుగా!
X

దీపికా ప‌దుకొణే తో బికినీ సాంగ్ అంటే మార్కెట్ లో ఓ సంచ‌ల‌నం. అమ్మ‌డి అందాలు స‌హా ఎత్తెన సొస‌గ‌రి టూ పీస్ లో క‌నిపించిందంటే? సంచ‌ల‌నం త‌ప్ప‌న‌స‌రి. అందులోనూ 'ప‌ఠాన్' లో బేష‌ర‌మ్ సాంగ్ లో సొగ‌స‌రి ధ‌రించిన బికినీ ఎంత‌టి వివాదాస్ప‌ద‌మైందో తెలిసిందే. కాషాయ రంగు బికినీ ఏకంగా దేశ రాజ‌కీయాలనే కుదిపేసింది. ఓ వ‌ర్గం దీపిక కి మ‌ద్ద‌తుగా నిలిస్తే మ‌రో వ‌ర్గం కాషాయం రంగు బికినీ ఏంట‌ని భ‌గ్గుమంది. అప్ప‌టి నుంచి దీపిక అంటేనే? మార్కెట్ లో ఓ సంచ‌ల‌నంగా మారిపోయింది.

అటుపై 'పైట‌ర్' టీజ‌ర్ లో సైతం హృతిక్ రోష‌న్ తో దీపిక బికినీ రొమాన్స్ షార్ట్ అంతే ఆస‌క్తిక‌రంగా మారింది. న‌లుపు వ‌ర్ణం బికీన లో అమ్మ‌డు హృతిక్ బాడీని వొంగి వొంగి ముద్దులు పెడుతోన్న వైనం యువ‌త‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీపిక మ‌రోసారి సంచ‌ల‌నం అవ్వ‌డం ఖాయ‌మ‌ని నాటి నుంచి మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతూనే ఉన్నాయి. తాజాగా ఆ వీడియో సాంగ్ ఫుల్ ట్రీట్ కి రెడీ అయింది.

కొద్ది సేప‌టి క్రిత‌మే ఆ బికినీ సాంగ్ ని రిలీజ్ చేసింది యూనిట్. 'ఇష్క్ జైసా కుచ్స అంటూ సాగే పాట‌లో హృతిక్-దీపిక మ‌ధ్య రొమాన్స్ పీక్స్ లో చూపించారు. మెలోడీ లో జోడీ మ‌ధ్య కెమిస్ట్రీ వావ్ అనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ పై జోడీ ఎంతో అందంగా క‌నిపిస్తుంది. ఇద్ద‌రు ఒకే హైట్ ని క‌లిగి ఉండ‌టం..ఫిజిక్ ప్ర‌తీది రొమాన్స్ ని నెక్స్ట్ లెవ‌ల్ కి తీసుకెళ్లిన‌ట్లే ఉంది. దీపికా బ్లాక్ బికినీ ఫుల్ ట్రీట్ ఇచ్చేసింది.

ఇక హృతిక్ తన ట్రేడ్‌మార్క్ షర్ట్‌లెస్ సిక్స్ ప్యాక్ లుక్ లో ఆక‌ట్టుకున్నాడు. దీపిక‌...హృతిక్ ని ముద్దుల‌తో ముంచెత్తిన వైనం..హృతిక్ మార్క్ సిగ్నెచ‌ర్ స్టెప్పులు..మెలోడీ బీట్ అదిరిపోయింది. పాట చిత్రీక‌రించిన లొకేష‌న్లు క‌నువిందుగా ఉన్నాయి. పాట‌లోనే ఈ రేంజ్ లో రొమాన్స్ చేసారంటే? సినిమాలో ఇంకే రేంజ్ లో రొమాన్స్ ఉంటుందో ఊహ‌కే అంద‌లేదు. ప్ర‌స్తుతం ఈ పాట నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ చిత్రానికి సిద్దార్ధ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.