రాజమౌళి..ప్రశాంత్ నీల్ రేంజ్ లో ఆయనకు సాధ్యమేనా?
ఇప్పటికే ఆ రకమైన ప్రణాళికలతో ముందుకె ళ్తున్నారు.
By: Tupaki Desk | 25 Jan 2024 2:30 AM GMTటాలీవుడ్ ట్రెండ్ మారిందిప్పుడు. తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా సినిమా అనే ముద్ర బలంగా పడిపోయింది. రాజమౌళి..ప్రశాంత్ నీల్..సుకుమార్..చందు మొండేటి లాంటి మేకర్స్ తోనే ఇది సాధ్య మైంది. భవిష్యత్ లో వీళ్లంతా మరిన్ని గొప్ప చిత్రాలు చేసి తెలుగు సినిమా స్థాయిని అంతకంతకు రెట్టింపు చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఆ రకమైన ప్రణాళికలతో ముందుకె ళ్తున్నారు.
మరి వీళ్ల రేంజ్ లో సినిమా చేయడం ఆ స్టార్ మేకర్ కి సాధ్యమైనా? అతనెప్పుడు పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాల్సింది ఆయన ఒక్కరే. ఇప్పటికే `దేవర` తో కొరటాల శివ సైతం పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు. తన సినిమా ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు చూస్తేనే తెలుస్తోంది.
తన శైలిని పక్కనబెట్టి తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్న చిత్రమిది. టెక్నికల్ సినిమాని హైలెవ్ ల్లోనే తీస్తున్నారని తెలుస్తుంది. అయితే దర్శకుడిగా టాలీవుడ్ గొప్ప పేరు సంపాదించిన ఆ గ్రేట్ రైటర్ కమ్ డైరెక్టర్ ఎప్పుడు పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగుపెడతాడు? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన పాన్ ఇండియాలోకి అడుగు పెట్టే ముందు ఆయన కథల శైలి మాత్రం పూర్తిగా మారాల్సిందే అన్న వాదన గట్టిగానే వినిపిస్తుంది.
ఓ ఫ్యామిలీ స్టోరీలో పాత్రల్ని ఎంత బలంగా తీర్చిదిద్దుతారో పాన్ ఇండియాలో సినిమా చేస్తే గనుక అంతకు మించి యూనివర్శల్ అప్పీల్ ఉన్న కంటెంట్ అవసరం. ఆయన పాన్ ఇండియా సినిమా చేయాలంటే ఉన్న పళంగా ఫ్యామిలీ జోనర్ పక్కనెబట్టాలి అన్నది ప్రధానమైన ఫిర్యాదుగా వినిపిస్తుంది. టెక్నికల్ గానూ సినిమాని హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఇంతవరకూ ఆ తరహా జానర్ కనీసం టచ్ చేసింది కూడా లేదు.
రామౌళిళి..ప్రశాంత్ నీల్ రేంజ్ లో పాత్రల్ని గొప్పగా ఎలివేట్ చేయాలి. లేదంటే సుకుమార్ స్టైల్లో గానీ...చందు మొండేటి..ప్రశాంత్ వర్మ స్ట్రాటజీని గానీ అనుసరిస్తేనే పాన్ ఇండియా మార్కెట్ లో వర్కౌట్ అవుతుంది. అంతేగానీ ఫ్యామిలీ స్టోరీతో ఆడియన్స్ తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తే మాత్రం అక్షింతలు తప్పవు.