Begin typing your search above and press return to search.

చిరంజీవి పిఠాపురం పాలిటిక్స్.. నిజమేనా?

కొన్ని సందర్భాల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించారు.

By:  Tupaki Desk   |   7 May 2024 4:08 AM GMT
చిరంజీవి పిఠాపురం పాలిటిక్స్.. నిజమేనా?
X

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమైన తర్వాత పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఏపీ రాజకీయాలలో ఎదిగే ప్రయత్నం చేస్తున్న చిరంజీవి బహిరంగంగా పవన్ కళ్యాణ్ కి మద్దతు ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ కి ఒక అన్నగా తన సపోర్ట్ ఉంటుందని మాట సాయం మాత్రం చేశారు. కొన్ని సందర్భాల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించారు.

వైసీపీ మూడు రాజధానుల అంశానికి మద్దతు ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం బిల్లుకి సపోర్ట్ చేశారు. ఏపీలో టిక్కెట్లు ధరల విషయంలో ఇండస్ట్రీ పెద్దగా నిలబడి వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ చర్చలు జరిపారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. మెగా హీరోలైన సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్ ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేశారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడానికి పిఠాపురం వస్తారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ నుంచి గాని, చిరంజీవి నుంచి గాని అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. మే 10న చిరంజీవి విజయవాడ వెళ్తారంట.

అలాగే మే11న చంద్రబాబుతో చిరంజీవి సమావేశం కానున్నారంట. అదే రోజు విజయవాడలో నారా రోహిత్ ప్రతినిధి2 సినిమాని చిరంజీవి వీక్షిస్తారంట. తర్వాత పిఠాపురం వెళ్లే అవకాశాలు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. కానీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియకి 48 గంటల ముందు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముగించాలని నిబంధనలు ఉన్నాయి.

మే 13న ఏపీలో ఎన్నికల ఓటింగ్ జరగబోతోంది. చిరంజీవి మే 11న సాయంత్రం పిఠాపురం వెళ్తాడనే మాట కరెక్ట్ అయినా ఆ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారం చేయడానికి ఛాన్స్ ఉండదు. రాజకీయ సమావేశాలు కూడా నిర్వహించకూడదు. ఒకవేళ అలా చేస్తే ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది.

మరి సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందా అంటే ఎలాంటి క్లారిటీ లేదు. జనసేన పార్టీ నుంచి అధికారికంగా చిరంజీవి పర్యటనపై క్లారిటీ వస్తేనే నిజమని నమ్మడానికి ఉంటుంది. గత నెల రోజుల నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారనే గాసిప్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అవేమీ వాస్తవం కాలేదు. మరి ప్రస్తుతం వినిపిస్తున్న మాట నిజమా కదా అనేది తెలియాల్సి ఉంది.