కల్కి2898ఏడీ విఎఫ్ఎక్స్ కోసం ఎంత ఖర్చుపెట్టారంటే?
సినిమా చూసిన ప్రతి ఒక్కరు విజువల్ స్పెక్టక్యులర్ గా కల్కి మూవీ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 15 July 2024 2:13 AM GMTనాగ్ అశ్విన్ సృష్టించిన వండర్ కల్కి 2898ఏడీ మూవీ ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ పై అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ ని మూడు వారాలలో కల్కి సినిమా అందుకుంది. ఇప్పటికి డీసెంట్ వసూళ్లతో థియేటర్స్ లో కొనసాగుతోంది. జులై 12న రిలీజ్ అయిన ఇండియన్ 2 మూవీకి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ప్రేక్షకులు కల్కి చిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
సినిమా చూసిన ప్రతి ఒక్కరు విజువల్ స్పెక్టక్యులర్ గా కల్కి మూవీ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కేవలం విజువల్ ఎఫెక్ట్స్ మహిమ అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో లార్జర్ దెన్ లైఫ్ కథలని మన ఇండియన్ దర్శకులు సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చాలా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రేక్షకులు పెదవివిరుస్తున్నారు.
ఆదిపురుష్ మూవీ ఫెయిల్యూర్ లో మేజర్ క్రెడిట్ విఎఫ్ఎక్స్ వర్క్ కి వెళ్తుందని చెప్పొచ్చు. చాలా నాసిరకంగా ఆ సినిమా గ్రాఫిక్స్ ఉన్నాయి. అయితే కల్కి 2898ఏడీ విషయంలో నాగ్ అశ్విన్ ఎక్కడ పొరపాటు చేయలేదు. తనకి కావాల్సిన, అవుట్ ఫుట్ మీద మళ్ళీ మళ్ళీ వర్క్ చేయించుకున్నారు. తాను ఎక్స్ పెక్ట్ చేసే రేంజ్ లో సీజీ వర్క్ వచ్చే వరకు కాంప్రమైజ్ కాకుండా విఎఫ్ఎక్స్ కంపెనీలతో వర్క్ చేయించారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం విఎఫ్ఎక్స్ కోసం నాగ్ అశ్విన్ కేవలం 150 కోట్లు మాత్రమే ఖర్చు చేసారంట. ఆర్టిస్ట్స్ కి రెమ్యునరేషన్ గా 250 కోట్ల వరకు ఇచ్చారంట. మిగిలిన మొత్తం ప్రొడక్షన్, ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 150 కోట్లు అంటే హాలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటే తక్కువే అని చెప్పాలి. అయిన కూడా బెస్ట్ సీజీ వర్క్ కల్కి మూవీలో కనిపిస్తుంది. ఇదంతా నాగ్ అశ్విన్ విజన్ తోనే సాధ్యమయ్యిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఆయనకి ఏం కావాలో స్పష్టమైన అభిప్రాయం ఉండటం వలనే ఇంత బెస్ట్ అవుట్ ఫుట్ ని రప్పించుకోగలిగారని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో నెక్స్ట్ రాబోయే పార్ట్ 2 మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పై నాగ్ అశ్విన్ ఫోకస్ చేసారంట. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారంట. అవన్నీ అయ్యాక ఆర్టిస్ట్స్ డేట్స్ బట్టి షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. 2026 ఆరంభంలో కల్కి 2898ఏడీ పార్ట్ 2ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారంట.