Begin typing your search above and press return to search.

ఆ విష‌యాన్ని భ‌ర్త ఎందుకు దాచేస్తున్న‌ట్లు?

కొన్ని నెల‌లుగా క‌త్రినా సినిమా షూటింగ్ ల‌కు దూరంగా ఉండ‌టానికి కార‌ణం కూడా బేబిబంప్ అంటూ బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది.

By:  Tupaki Desk   |   29 Jun 2024 12:30 PM
ఆ విష‌యాన్ని భ‌ర్త ఎందుకు దాచేస్తున్న‌ట్లు?
X

బాలీవుడ్ న‌టి క‌త్రినా కైఫ్ గ‌ర్భం దాల్చిన‌ట్లు సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు ఏ రేంజ్ లో వైర‌ల్ అయ్యాయో తెలిసిందే. క‌త్రినా బేబి బంప్ ఫోటోలు కూడా నెట్టింట వైర‌ల్ అయ్యాయి. నెల‌లు నిండ‌టంతో ప్ర‌స‌వం కోసం అమెరికా వెళ్లిన‌ట్లు కూడా ప్ర‌చారం సాగింది. కొన్ని నెల‌లుగా క‌త్రినా సినిమా షూటింగ్ ల‌కు దూరంగా ఉండ‌టానికి కార‌ణం కూడా బేబిబంప్ అంటూ బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది.

అయితే అవ‌న్నీ గాలి వార్త‌లే అన్న‌ట్లు భ‌ర్త‌, న‌టుడు విక్కీ కౌశ‌ల్ స్పందించారు. అలాంటి శుభ‌వార్త ఉంటే మేమే స్వ‌యంగా ప్రేక్ష‌కాభిమానుల‌తో పంచుకుంటాం. స‌రైన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మేం ఆవిష‌యం చెప్ప‌డానికి సిగ్గుప‌డం` అని అన్నారు. దీంతో క‌త్రినా అస‌లు గ‌ర్బం దాల్చిందా? లేదా? అన్న అనుమా నాలు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌ర్భ‌వ‌తి విష‌యాన్ని విక్కీ కౌశ‌ల్ దాస్తున్నాడా? అన్న‌ది మ‌రో సందేహం. ఇంత‌వ‌ర‌కూ సోష‌ల్ మీడియాలో జ‌రిగింది కేవ‌లం ప్ర‌చార‌మేన‌న్న సందేహా లు బ‌ల‌ప‌డుతున్నాయి.

అలాగే వివాహం త‌ర్వాత విక్కీ కౌశ‌ల్ త‌న‌లో మార్పులు వ‌చ్చాయ‌న్నారు. పెళ్లి త‌ర్వాత అంద‌రి జీవితాల్లో మార్పు వ‌స్తుంది. మ‌రో వ్య‌క్తితో క‌లిసి జీవితాన్ని ప్రారంభించ‌డం చాలా పెద్ద విష‌యం. పెళ్లికి ముందు వ‌ర‌కూ ఒక్కరి గురించే ఆలోచిస్తాం. పెళ్లి అయితే ఇద్ద‌రి గురించి ఆలోచించ‌డం మొద‌లవుతుంది. నా 36 ఏళ్ల జీవితంలో మొద‌టి 33 ఏళ్ల జీవితం కంటే ఈ రెండేళ్ల‌లో ఉన్న‌తంగా ఆలోచించ‌డం మొద‌లు పెట్టాను. నాలో చాలా మార్పులొచ్చాయి` అని అన్నారు.

ప్ర‌స్తుతం విక్కీ కౌశ‌లో `బ్యాడ్ న్యూజ్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇంకా క‌మిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సి ఉంది. మ‌రోవైపు దేశ‌భ‌క్తి నేప‌థ్యంలోనూ విక్కీ కౌశ‌ల్ చేస్తోన్న సినిమాలు ప్రేక్ష‌కుల్ని అంతే ఆక‌ట్టుకుంటున్నాయి.