నాగార్జున ఖిలాడీనే దించుతున్నాడా?
మెయిన్ లీడ్ ధనుష్ పోషిస్తుండగా ..కీలమైన బాద్యతలు నాగార్జునకు అప్పగించడంతో సీన్ లోకి వచ్చారు.
By: Tupaki Desk | 3 Feb 2024 2:45 AM GMTఇటీవలే కింగ్ నాగార్జున 'నా సామిరంగ'తో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. మరోసారి నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చిందని నిరూపితమైంది. ఇప్పుడదే ఉత్సాహంలో శేఖర్ కమ్ములా సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇందులో కింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మెయిన్ లీడ్ ధనుష్ పోషిస్తుండగా ..కీలమైన బాద్యతలు నాగార్జునకు అప్పగించడంతో సీన్ లోకి వచ్చారు.
ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో కమ్ములా పాన్ ఇండియా లో రిలీజ్ చేస్తున్న చిత్రమిది. ఇద్దరి హీరోలతో తెలుగు..తమిళ లోనే కోట్ల రూపాయల బిజినెస్ చేయాలన్నది కమ్ములా ప్లాన్. అందుకే ఈ రేర్ కాంబినేషన్ ని తెరపైకి తెచ్చి కమ్ములా సైతం కొత్త జోనర్ లో ట్రై చేస్తున్న చిత్రమిది. తాజాగా నాగార్జున కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది.
తమిళ కుర్రాడు నవీన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున తదుపరి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. అయితే ఈ చిత్రాన్ని నాగార్జున పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే కథలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ని దించాలని భావిస్తున్నారుట. ప్రస్తుతం టీమ్ అక్షయ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఆయన రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. అక్షయ్ కుమార్ ఏటా ఏ హీరో చేయనన్ని సినిమాలు చేస్తుంటాడు.
బాక్సాఫీస్ వద్ద ఏటా ఆయన సినిమాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. పాత్ర నచ్చిం దంటే యస్ చెప్పడం తప్ప నో చెప్పడం అనే మాట ఆయన డిక్షనరీలో లేదు. చివరికి నెగిటివ్ రోల్ అయినా చేయడం ఆయన ప్రత్యేకత. ఈ నేపథ్యంలో నాగార్జున తదుపరి సినిమా భారీ పాన్ ఇండియా సినిమా అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే 'బ్రహ్మస్త్ర' లో నాగార్జున నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి రెండవ భాగం ఉన్న నేపథ్యంలో నాగ్ మల్టీస్టారర్ పై మంచి బజ్ కి ఛాన్స్ ఉంది.