Begin typing your search above and press return to search.

బాలయ్య మళ్లీ సంక్రాంతి ట్రీట్..!

ఈమధ్య స్టార్ సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి తీరా టైం దగ్గర పడుతున్న తరుణంలో రిలీజ్ వాయిదా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 July 2024 5:11 AM GMT
బాలయ్య మళ్లీ సంక్రాంతి ట్రీట్..!
X

సీనియర్ హీరోల్లో వరుస సూపర్ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న డైరెక్టర్ బాలకృష్ణ ప్రస్తుతం కె ఎస్ బాబీ డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సితార, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తుండగా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా వెల్లడించలేదు. ఈమధ్య స్టార్ సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి తీరా టైం దగ్గర పడుతున్న తరుణంలో రిలీజ్ వాయిదా వేస్తున్నారు.

ఇప్పటికే ఈ ఇయర్ రాబోయే చాలా సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి. ఐతే బాలయ్య సినిమా అలా కాకుండా ఒక పర్ఫెక్ట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బాలకృష్ణ కె ఎస్ బాబీ కాంబినేషన్ మొదటిసారి కలిసి చేస్తున్న సినిమాగా ఇది నందమూరి ఫ్యాన్స్ కే కాదు మాస్ ఆడియన్స్ కు మంచి ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన బాబీ బాలకృష్ణతో కూడా మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఈ సినిమాకు వీర మాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఐతే ఈ సినిమాను ముందు డిసెంబర్ రేసులో దించాలని అనుకున్నారు. సినిమా ముందే పూర్తైతే దసరాకి రిలీజ్ ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఏపీలో ఎలక్షన్స్ వల్ల అది కుదరలేదు. అందుకే సినిమాను డిసెంబర్ లో తీసుకు రావాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్ లో కూడా రిలీజ్ లు ఎక్కువ అవ్వడం వల్ల ఏకంగా సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

సంక్రాంతికి ఇప్పటివరకైతే చిరు విశ్వంభర అనౌన్స్ చేశారు. రవితేజ సినిమా కూడా ఒకటి రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్ రాజా సాబ్ కూడా పొంగల్ రేసులో ఉండే ఛాన్స్ ఉంది. వీటితో పాటుగా బాలయ్య సినిమా కూడా ఉంటుందని అంటున్నారు. సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ సినిమాలు దాదాపు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ కూడా వీర సింహా రెడ్డి వచ్చింది. ఐతే ఈ ఇయర్ సంక్రాంతి వదిలేసిన బాలయ్య నెక్స్ట్ పొంగల్ కి మాత్రం వీర మాస్ తో రావాలని చూస్తున్నాడు. బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తే మిగతా సినిమాల రిలీజ్ ల విషయంలో మరోసారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పొచ్చు.