పూరి లైనప్ పక్కనబెట్టి రాసిన స్క్రిప్ట్ ఇది!
అయితే 'డబ్బుల్ ఇస్మార్ట్' మాత్రం తన లైనప్ ని పక్కనబెట్టి తీసిన చిత్రంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ రివీల్ చేసాడు.
By: Tupaki Desk | 11 Aug 2024 1:15 PM GMTహీరో క్యారెక్టరైజేషన్ మీద కథరాసి సినిమా తీయగల ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాధ్. ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ హీరో క్యారేక్టర్ ని బేస్ చేసుకుని తీసినవే. 'ఇడియట్' నుంచి మొన్నటి 'ఇస్మార్ట్ శంకర్' వరకూ ఇదే విధానంలో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. అయితే 'డబ్బుల్ ఇస్మార్ట్' మాత్రం తన లైనప్ ని పక్కనబెట్టి తీసిన చిత్రంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ రివీల్ చేసాడు.
ప్రస్తుతం రామ్ హీరోగా పూరి తెరకెక్కించిన 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ కి రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచార చిత్రాలతో సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ కావడంతో రెట్టించిన ఎనర్జీతో రామ్ పెర్మార్మెన్స్ ఉంటుందని అభిమానులంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాని ఉద్దేశించి రామ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
`పూరి తన మార్క్ ని పక్కన బెట్టి రాసిన కథ. ఇస్మార్ట్ శంకర్ హీరో క్యారెక్టరేజేషన్ మీద నడుస్తుంది. ఇప్పుడా పాత్ర కోసం పూరి గారు ఓ కథరాస్తే ఎలా ఉంటుందని రాసారు. ఆ పాత్ర చుట్టూ ఓ డ్రామా ఉంటే ఎలా ఉంటుందో ఇందులో హైలైట్ చేసారు. శంకర్ ఎనర్జీ ఏమాత్రం తగ్గకుండా రెట్టించిన ఎనర్జీతో పాత్రని హైలైట్ చేస్తూనే బలమైన కథని చెప్పారు. ఆయనతో పనిచేయడం అంటే షూటింగ్ చేసినట్లు ఉండదు.
ఏనటుడికైనా సీన్ ఎంతవరకూ చెప్పాలో? అంత చెప్పి వదిలేస్తారు. అతని దగ్గర అది ఎంతో కంపర్ట్ గా ఉంటుంది. అందుకే షూటింగ్ అంటే సరదాగా వెకేషన్ లా అయిపోతుంది. పైగా ఎక్కువ టైమ్ కూడా తీసుకోరు. ఇంతవరకు ఎక్కువ సమయం తీసుకుంది కూడా ఈ సినిమాకే అనుకుంటాను` అని అన్నారు.