Begin typing your search above and press return to search.

చరణ్ - సుక్కు ఏంటీ మ్యాటర్?

ఇటీవలే RC16 చిత్రం అధికారికంగా లాంచ్ అయింది, ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్లు వెలువడుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 Aug 2024 3:00 AM GMT
చరణ్ - సుక్కు ఏంటీ మ్యాటర్?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కలయికలో మరో ప్రతిష్టాత్మక చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. RRR టైమ్ లోనే రామ్ చరణ్ సుక్కు కాంబినేషన్ పై అఫీషియల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు సానాతో చేస్తున్న RC16 చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే సుక్కు ప్రాజెక్ట్‌ లో (RC17) చరణ్ జాయిన్ కానున్నాడు. ఇటీవలే RC16 చిత్రం అధికారికంగా లాంచ్ అయింది, ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్లు వెలువడుతున్నాయి.

మరోవైపు సుకుమార్ పుష్ప 2 సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ లో సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు షూటింగ్ పూర్తి కాగానే సుక్కు చరణ్ ప్రాజెక్టు కు జెట్ స్పీడ్ లో షిఫ్ట్ కానున్నాడు. RC 17 కోసం సుకుమార్ టీమ్, సీనియర్ రైటర్లు కలిసి స్క్రిప్ట్ వర్క్‌లో కీలక భాగస్వామ్యంగా ఉన్నారు. రామ్ చరణ్ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేయడానికి సుకుమార్ కృషి చేశాడు.

ఈ సినిమా యాక్షన్ డ్రామా జానర్ లో రూపొందబోతుంది. ఇప్పటికే చరణ్ కోసం సుకుమార్ క్రేజీ లుక్ డిజైన్ చేశారని సమాచారం. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. అంతేకాక, ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది రెండు భాగాల సినిమాగా రాబోతోందని వచ్చిన వార్తలు ఉన్నా, సుకుమార్ టీమ్ మాత్రం ఇది సింగిల్ పార్ట్ మూవీ మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం సుకుమార్ స్టైల్ లో భారీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సింగిల్ పార్ట్ లోనే కథను ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోలు దర్శకులు ఎక్కువగా రెండు భాగాలుగా సినిమాలను తెరపైకి తీసుకు వస్తున్నారు. కానీ సుక్కు పుష్ప 2 అనంతరం అలాంటి ప్రయోగాలు ఏమి చేయడం లేదట.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ గతంలో 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ సినిమా ఉంది. అందుకే ఈ కాంబినేషన్ లో రాబోతున్న ఈ కొత్త ప్రాజెక్ట్ పై అంచనాలు ఇప్పటి నుంచే భారీగా ఉన్నాయి. సుకుమార్ తనదైన స్టైల్ లో ఈసారి కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం 'బుచ్చిబాబు సానా' పూర్తి కాగానే, సుకుమార్ సినిమా కోసం న్యూ లుక్ తో సిద్ధమవ్వనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు, కాస్టింగ్, షూటింగ్ అప్‌డేట్స్ త్వరలోనే వెలువడనున్నాయి.