Begin typing your search above and press return to search.

రవితేజ సినిమా.. మరోటి అటకెక్కినట్టేనా..?

ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ కాగా ఈసారి కూడా అదరగొట్టేస్తారని అనుకున్నారు.

By:  Tupaki Desk   |   6 July 2024 2:30 AM GMT
రవితేజ సినిమా.. మరోటి అటకెక్కినట్టేనా..?
X

అదేంటో మాస్ రాజా రవితేజకు ఈమధ్య టైం కాస్త తేడా కొట్టేస్తుందని చెప్పొచ్చు. సక్సెస్ ఫెయిల్యూర్ లు కామనే కానీ ఒక మంచి కాంబినేషన్ సినిమా సెట్ అవుతుంది అనుకునేలోగా అది కాస్త ఏవో కారణాల వల్ల వాయిదా పడుతుంది. ఆమధ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమా ప్లాన్ చేశారు. ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ కాగా ఈసారి కూడా అదరగొట్టేస్తారని అనుకున్నారు.

కానీ అనౌన్స్ మెంట్ అయితే చేశారు కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమా క్యాన్సిల్ చేసుకున్నారు. రవితేజ కెరీర్ లో ఇలా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయిన సినిమాల లిస్ట్ లో మరో సినిమా చేరుతుందని టాక్. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ కోసం మాస్ మహరాజ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే వాళ్లకి షాక్ ఇస్తూ సినిమా అటకెక్కిందని అంటున్నారు. అనుదీప్ కెవి రవితేజ సినిమా కూడా ఎందుకో మెటీరియలైజ్ అవ్వలేకపోతుందని అంటున్నారు.

రవితేజ బదులుగా విశ్వక్ సేన్ తో అనుదీప్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ తో రవితేజ సినిమా ఎందుకు క్యాన్సిల్ అయ్యిందన్న విషయంపై క్లారిటీ రాలేదు. రవితేజ మాత్రం తనకు అన్ని కరెక్ట్ గా కుదిరిన సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి మాస్ రాజా తన ఫ్యాన్స్ ని అలరించనున్నాడు. ఈమధ్య వచ్చిన మిస్టర్ బచ్చన్ షో రీల్ అదిరిపోయింది.

బాలీవుడ్ సినిమా రైడ్ రీమేక్ గా వస్తున్న ఈ మిస్టర్ బచ్చన్ సినిమాపై మాస్ రాజా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత అసలైతే అనుదీప్ సినిమా స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా దాదాపు ఆగిపోయినట్టే అని చెప్పుకుంటున్నారు. మరి అనుదీప్ రవితేజ ఇప్పుడు కుదరకపోయినా తర్వాత అయినా చేస్తారా లేదా అన్నది చూడాలి. మరి విశ్వక్ సేన్ తో అనుదీప్ సినిమా ఎలాంటి సినిమాతో వస్తుందో అని ఆడియన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. తన ప్రతి సినిమాతో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్న విశ్వక్ సేన్ అనుదీప్ తో కూడా కచ్చితంగా కొత్త అటెంప్ట్ చేస్తాడని చెప్పొచ్చు.