రేణూ దేశాయ్ కి మళ్లీ ఎంగేజ్‌మెంట్ జరిగిందా?
సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని వెల్లడిస్తూ ఎంగేజ్‌మెంట్ జరిగిందనే విధంగా చేతికున్న ఉంగరాన్ని ప్రదర్శించింది రేణూ దేశాయ్.
By: Tupaki Desk | 18 Oct 2023 6:35 AMనటి,దర్శకురాలు, కాస్ట్యూమ్ డిజైనర్ రేణూ దేశాయ్.. టాలీవుడ్ టాప్ స్టార్ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల వైవాహిక జీవితం కారణంగా వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తరువాత ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో పవన్ నుంచి విడిపోయి గత కొంత కాలంగా విడిగా పిల్లలతో కలిసి ఉంటోంది. అయితే పవన్‌తో విడిపోయిన తరువాత రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతోందని, తన కుటుంబానికి దగ్గరి వ్యక్తి అయినటువంటి ఓ వ్యక్తిని రేణూ పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వినిపించాయి.
సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని వెల్లడిస్తూ ఎంగేజ్‌మెంట్ జరిగిందనే విధంగా చేతికున్న ఉంగరాన్ని ప్రదర్శించింది రేణూ దేశాయ్. అయితే ఇదంతా సినిమా ప్రచారం అని, తను రెండో పెళ్లి చేసుకోవడం లేదని అంతా భావించారు. కానీ తాజాగా ఓ మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ ఫైనల్‌గా రెండో పెళ్లి, ఎంగేజ్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి ఆశ్చర్యపరిచింది.
పవన్ కల్యాణ్‌తో విడిపోయాక రెండో పెళ్లి, ఎంగేజ్‌మెంట్ గురించి ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు కదా? అని అడిగిన ప్రశ్నకు రేణూ దేశాయ్ ఆసక్తికరంగా స్పందించింది. పవన్‌నుంచి విడిపోయాక రెండో పెళ్లి చేసుకోమని చాలా మంది తనకు సలహా ఇచ్చారని తెలిపింది. దీంతో కొన్నేళ్ల కిందట ఓ వ్యక్తితో తాను ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ టైమ్‌లో ఆద్యకు ఏడేళ్లే. పెళ్లి చేసుకుంటే ఆమెతో టైమ్ స్పెండ్ చేయలేనని భావించి ఎంగేజ్‌మెంట్‌ని రద్దు చేసుకున్నానని తెలిపింది.
ఇప్పుడు ఆద్యకు 13 ఏళ్లు. తను కాలేజీకి వెళ్లిన తరువాత పెళ్లి గురించి, నా గురించి ఆలోచిస్తా అన్నారు. తన రెండో పెళ్లిపై వచ్చిన వార్తలపై కాస్త ఘాటుగానే స్పందించారు రేణూ. చాలా ఏళ్లుగా దీనిపై వివరణ ఇవ్వాలని అనుకుంటూనే ఉన్నాను. సినిమాల గురించి, టీవీ షోల గురించి మాట్లాడే దాన్ని కానీ నా వ్యక్తిగత జీవితం గురించి మాత్రం సైలెంట్‌గానే ఉండాలనుకున్నాను. నేను ఎంగేజ్‌మెంట్ చేసుకుంది నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి తెలిసిన వ్యక్తితో. అది లవ్ మ్యారేజ్ కాదు. అరేంజ్డ్ మ్యారేజ్. పెద్దల అంగీకారంతో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను.
నా నిర్ణయం విషయంలో అకీరా, ఆద్య హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అది నా నిర్ణయం కాబట్టి. అయితే ఇప్పటికే తండ్రి దూరమైన పిల్లలని నేను కూడా దూరమై మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతే వారి పరిస్థితి ఏంటని ఆలోచించాను. ఆ కారణంగానే రెండో పెళ్లిని ఎంగేజ్‌మెంట్ తరువాత రద్దు చేసుకున్నాను` అని తెలిపారు రేణూ దేశాయ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.