Begin typing your search above and press return to search.

పవన్ తో విడాకులు.. టార్చర్ పెట్టొద్దన్న రేణు దేశాయ్

ఇటీవల జరిగిన పవన్ ప్రమాణ స్వీకార వేడుకకు కూడా ఇద్దరూ తెలుగు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి సందడి చేశారు.

By:  Tupaki Desk   |   16 Jun 2024 2:47 PM GMT
పవన్ తో విడాకులు.. టార్చర్ పెట్టొద్దన్న రేణు దేశాయ్
X

ఏపీ డిప్యూటీ సీఎం కమ్ హీరో పవన్ కళ్యాణ్, సీనియర్ నటి రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. వీరి బంధానికి గుర్తుగా పుట్టిన అకిరా నందన్, ఆద్యతో కలిసి విడాకుల తర్వాత రేణు ఉంటున్నారు. మెగా ఇంట్లో ఏ శుభకార్యం, పార్టీలు జరిగినా.. పిల్లలిద్దరూ అటెండ్ అవుతుంటారు. ఇటీవల జరిగిన పవన్ ప్రమాణ స్వీకార వేడుకకు కూడా ఇద్దరూ తెలుగు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి సందడి చేశారు.

అయితే చాలా ఏళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న రేణు.. రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది. పలు విషయాలపై పోస్టులు పెడుతుంటోంది. కానీ ఎవరైనా పవన్ ప్రస్తావన తీసుకొస్తే గట్టిగా కౌంటర్లు ఇస్తుంటోంది. కొన్ని సందర్భాల్లో ఘాటుగానే సమాధానాలిస్తుంటోంది. చెప్పినా వినకుండా కామెంట్స్ పెట్టిన వాళ్లను అనేక మంది బ్లాక్ చేశానని ఈ మధ్య ఓ విషయంలో చెప్పింది.

ఇటీవల తన ఇంట్లో గణపతి చండీ హోమం జరిగినట్లు చెప్పింది. పూజల టైమ్ లో తానే ప్రసాదం చేస్తానని చెప్పుకొచ్చింది. ప్రసాదం చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది. ఆ సమయంలో పట్టు చీరలో మెరిసిపోయింది. అయితే రీసెంట్ గా ఓ నెటిజన్.. రేణు దేశాయ్ ను ట్యాగ్ చేసి ఓ కామెంట్ పెట్టాడు. దీంతో రేణు ఘాటు రిప్లై ఇచ్చింది. దయచేసి ఇలాంటి కామెంట్స్ పెట్టి టార్చర్ పెట్టొద్దని కోరింది. అసలేం జరిగిందంటే?

"వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని వివాహం చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏదేమైనా విధి ప్రతిదీ డిసైడ్ చేస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు.. అది చాలు వదిన. వీ ఆర్ మిస్సింగ్ యూ వదిన" అని సుధాకర్ అనే నెటిజెన్ కామెంట్ పెట్టాడు. దీంతో రేణు స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది.

"సుధాకర్ గారు మీకు కొంచెం కూడా బుద్ధి ఉన్నా ఇలా చెప్పరు.. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. నేను కాదు. దయచేసి నాకు ఇంకా టార్చర్ చేయొద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టి 🙏" అని రేణు రిప్లై పెట్టింది. అన్న లేక పోయినా పూజలు చేస్తున్నారని మరో నెటిజన్ అనగా.. 'మీరేం అనుకుంటున్నారు? నాకు నా సొంత లైఫ్ ఉండకూడదా? ఇలాంటి కామెంట్స్ తో సీరియస్ గా చెబుతున్నా.. చాలా బాధ పెడుతున్నారు' అని చెప్పింది రేణు దేశాయ్.