ఆయనలో టెన్షన్ పరుగులు పెడుతోందా?
కల్కి నాగ్ అశ్విన్ డైరెక్టర్ చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ పై అసాధా రణమైన అంచనాలున్నాయి.
By: Tupaki Desk | 21 April 2024 11:30 PM GMTపాన్ ఇండియా చిత్రాలు 'కల్కి 2898'..'భారతీయుడు-2' చిత్రాలు జూన్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రెండు రిలీజ్ ల మధ్య కనీసం రెండు వారాలు గ్యాప్ ఉండేలా చిత్ర నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకుండా చూసుకుంటే ఇద్దరు సేఫ్ జోన్ లో ఉన్నట్లేనన్నది నిర్మాతల వెర్షన్. రెండు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. కల్కి నాగ్ అశ్విన్ డైరెక్టర్ చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ పై అసాధా రణమైన అంచనాలున్నాయి. టెక్నికల్ గా సినిమాని హైలైట్ చేస్తున్నారు. ప్యూచర్ ఇండిడానికి ఇందులో చూపించబోతున్నారు.
దీనికి తోడు డార్లింగ్ ప్రభాస్ పుల్ ఫామ్ లో ఉన్నాడు. 'సలార్' విజయంతో రెట్టించిన ఉత్సాహంలో కనిపిస్తున్నాడు. ఇలా సినిమాపై అన్ని రకాలుగా పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. అయితే శంకర్ భారతీయుడు-2 విషయంలో ఇంత పాజిటివ్ వైబ్ కనిపించలేదు. సినిమా మొదలైన నాటి దగ్గర షూట్ పూర్తయ్యేవరకూ అభిమానుల్లో ఎగ్జైట్ మెంట్ తీసుకురావడంలో విఫలమయ్యారు. హిట్ సినిమా భారతీయుడుకి సీక్వెల్ అనే పేరు తప్ప! అందులో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు? అన్నది ఎక్కడా లీక్ కాలేదు. లంచం..రాజకీయ నేపథ్యమున్న కథ అని కొంత వరకూ అంచనా వేసినా? ఇప్పుడున్న మార్కెట్ లో అదెంత వరకూ వర్కౌట్ అవుతుంది? ఆ పాయింట్ ని శంకర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? అన్న దానిపై బజ్ తీసుకొచ్చే ప్రయత్నాలైతే ఏవీ జరగలేదు.
పోస్టర్లు...మోషన్ పోస్టర్లు వరకూ ఒకే గానీ.. కంటెంట్ ఎంత స్ట్రాంగ్ ఉండబోతుంది? అన్నది ఎక్కడా హైప్ రావడం లేదు. భారతీయుడు తర్వాత ఎన్నో పొలిటికల్ స్టోరీలు తెరపైకి వచ్చాయి. మరి రాజకీయాలు మారిన ట్రెండ్ నేపథ్యంలో శంకర్ ఇండియన్-2 లో ఏం చెప్పబోతున్నాడో చూడాలి. అలాగే అనిరుద్ మ్యూజికల్ గా మ్యాజిక్ చేస్తాడా? లేదా? అన్నది సందేహం మారింది. ఒకవేళ భారతీయుడు-2 ఫలితం అటు ఇటు అయితే ఆ ప్రభావం రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ ఛేంజర్' పై పడుతుంది.
'ఆర్ ఆర్ ఆర్' తర్వాత చరణ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్నాడు. ఈ విషయంలో శంకర్ ని ఎంతగానో నమ్మాడు. హిట్ అయితే అంతకు మించి గేమ్ ఛేంజర్ పై బజ్ రెట్టింపు అవుతుంది. లేదంటే సమీకరణాలు మారడానికి అవకాశం లేకపోలేదు. ఒకే ఏడాది ఈ రెండు రిలీజ్ లతో శంకర్ అయితే ఎన్నడు తీసుకోనంత టెన్షన్ పడుతున్నట్లే కనిపిస్తుంది.