Begin typing your search above and press return to search.

ఆ మాస్ క‌పుల్ మ‌ళ్లీ జ‌త క‌డుతున్నారా?

మ‌రి ఈ హిట్ జోడీ మ‌ళ్లీ జ‌త క‌డుతుందా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 9:30 AM GMT
ఆ మాస్ క‌పుల్ మ‌ళ్లీ జ‌త క‌డుతున్నారా?
X

'బవాల్' సినిమాతో వ‌రుణ్ ధావ‌న్-జాన్వీక‌పూర్ జోడీ ఎంత‌గా అల‌రించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో పాటు భార్య‌భ‌ర్త‌లుగా న‌టించిన ఆ జోడీకి మంచి పేరు తీసు కొచ్చింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. ఆన్ స్క్రీన్ పై ఈ జోడీకి మంచి గుర్తింపు ద‌క్కింది. మ‌రి ఈ హిట్ జోడీ మ‌ళ్లీ జ‌త క‌డుతుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. తాజాగా మ‌రో భిన్న‌మైన ప్రేమ క‌థ‌లో న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు.


ఇద్ద‌రు మెయిన్ లీడ్స్ లో స‌న్నీ సంస్కారీ కీ తుల‌సి కుమారి ' అనే చిత్రం లో న‌టిస్తున్న‌ట్లు అధికారిక‌గా ప్ర‌కటించారు. 'బ‌ద్రీనాధ్ కి దుల్హానియా' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు ద‌క్కించుకున్న శ‌శాంక్ తైవాన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మీ సంస్కారి కుమారి ప్రేమ కోసం వెళ్తున్నాడు? వినోదం తో కూడిన ఈ ప్రేమ‌క‌థా చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తామ‌ని తేదీ కూడా ప్ర‌క‌టించారు.

దీంతో ఆ జోడీ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతోషం వ్య‌క్తం చేస్తున్నాడు. బ‌వాల్ జంట మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేయ‌డం అన్న‌ది ఇంత త్వ‌ర‌గా జ‌రుగుతుంద‌ని గెస్ చేయ‌లేదు. ఇది మాకు ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ అంటూ అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌రుణ్ ధావ‌న్ 'బేబిజాన్' లో న‌టిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అలాగే ముందు క‌మిట్ అయిన ప్రాజెక్ట్ ఒక‌టి ఉంది. దాన్ని పూర్తి చేయాలి.

ఇటు జాన్వీక‌పూర్ కూడా హిందీతో పాటు తెలుగు లో దేవ‌ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు త్వ‌ర‌లో ఆర్ సీ 16వ చిత్రంలోనూ ఈ భామ‌నే నాయిక‌గా ఎంపిక చేసారు. ఆ సినిమా షూటింగ్ కూడా అతి త్వ‌ర‌లోనే ప్రారంభం అవుతుంది. అప్ప‌టి నుంచి జాన్వీ ఆ సినిమా సెట్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. మ‌రో వైపు హిందీ క‌మిట్ మెంట్లు. ఈ నేప‌థ్యంలో ముంబై టూ హైద‌రాబాద్ జ‌ర్నీ ఇంకొన్నాళ్లు త‌ప్ప‌దు.