నటి న్యూడిటీని అలా కవర్ చేసారా!
హాలీవుడ్ సినిమాల్లో శృంగార సన్నివేశాలనేవి చాలా సహజంగా ఉంటాయి. ఇండియాలో అలాంటి వాటికి అనుమతి లేదు. ఇలాంటి వాటి విషయంలో సెన్సార్ కొన్ని నియమ నిబంధనలు తప్పక పాటిస్తుంది. శృంగార సన్నివేశాలుంటే బ్లర్ చేస్తుంది.
By: Tupaki Desk | 24 July 2023 11:35 AM GMTహాలీవుడ్ సినిమాల్లో శృంగార సన్నివేశాలనేవి చాలా సహజంగా ఉంటాయి. ఇండియాలో అలాంటి వాటికి అనుమతి లేదు. ఇలాంటి వాటి విషయంలో సెన్సార్ కొన్ని నియమ నిబంధనలు తప్పక పాటిస్తుంది. శృంగార సన్నివేశాలుంటే బ్లర్ చేస్తుంది. అభ్యంతరకర సంభాషణలుంటే బీప్ సౌండ్ వేస్తుంది. అవసరం మేర ఆయా సన్నివేశాలకు కత్తెర పడుతుంది. ఇలా ఇండియాలో సెన్సార్ కి కట్ కి బలైన హాలీవుడ్ సినిమాలు చాలానే ఉన్నాయి.
ఇటీవలి కాలంలో `గాన్ గర్ల్`- `నో హార్డ్ ఫీలింగ్స్` - `మూన్‌లైట్ `వంటి చిత్రాలు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాయి. `హైదర్` - `లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా` వంటి కొన్ని భారతీయ సినిమాలు సీబీఎఫ్ సీ ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాయి. సినిమాలో ఎక్కడా అశ్లీలత ఉన్న సెన్సార్ శివతాండవం ఆడేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన `ఓపెన్ హైమర్` సినిమాలో శృంగార సన్నివేశాలకు ఎలాంటి కొదవలేదు. ఇండియా లో వాటికి కట్ పడినా..హాలీవుడ్ లో మాత్రం యధాతధంగా ఆయా సన్నివేశాలుంటాయి.
సినిమాలో పగ్ శృంగార సన్నివేశం అనంతరం అచేధనంగా ఓ కుర్చీలో కుర్చుని ఉంటుంది. ఆ సన్నివేశానికి సెన్సార్ ఇబ్బందులు తప్పవని భావించిన టీమ్ పగ్ అచేధన తనాన్ని సీజీ వర్క్ లో కవర్ చేసారు. నల్లటి వస్త్రాన్ని కప్పుకున్నట్లు చూపించారు. అయితే ఈ సన్నివేశంలో సెన్సార్ తప్పించుకున్నా ఇదే సీన్ లో భగవద్గీతని చదివినట్లు చూపించారు. ఆ సంభాషణలకు సెన్సార్ కట్ వేయలేదు.
ఈ అంశంపై భారతీయులు ఎలా మండిపడుతున్నారో తెలిసిందే. దేశమంతా ఆగ్రజ్వాలలతో రగిలిపో తుంది. భారతీయులు పవిత్ర గ్రంధాన్ని శృంగార సన్నివేశంలో చదవడం ఏంటి అని రావణ కాష్టగా మారే సన్నివేశం కనిపిస్తుంది. ఈ విషయంలో సెన్సార్ విఫలమైందని మండిపడుతున్నారు. ఇలాంటి సన్నివేశానికి సెన్సార్ ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నిస్తన్నారు. తక్షణం సెన్సార్ దీనిపై వివరణ ఇవ్వాలని నెటి జనులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.