Begin typing your search above and press return to search.

త్రివిక్రం పై అసంతృప్తి.. వెంకీ కామెంట్ కారణం అదేనా..?

ముఖ్యంగా వాళ్లిద్దరు కలిసి మరో నువ్వు నాకు నచ్చావ్ సినిమా లాంటిది చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 Jan 2024 7:19 AM GMT
త్రివిక్రం పై అసంతృప్తి.. వెంకీ కామెంట్ కారణం అదేనా..?
X

మాటల మాంత్రికుడు త్రివిక్రం తను డైలాగ్ రైటర్ గా ఉన్నప్పుడే విక్టరీ వెంకటేష్ తో సినిమాలు చేశాడు. అయితే డైరెక్టర్ గా మారిన తర్వాత మాత్రం వెంకటేష్ తో సినిమా చేసేందుకు అవకాశం రావట్లేదు. వెంకీ, గురూజీ ఈ కాంబో సినిమా చూడాలని తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వాళ్లిద్దరు కలిసి మరో నువ్వు నాకు నచ్చావ్ సినిమా లాంటిది చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ వెంకటేష్ త్రివిక్రం సినిమా ముహూర్తం బయట పడట్లేదు.

లేటెస్ట్ గా వెంకటేష్ సైంధవ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మీడియా వాళ్లు కూడా త్రివిక్రం తో సినిమా ఎప్పుడని అడిగారు. దానికి వెంకటేష్ సమాధానం ఇస్తూ కాల్ చేయండి ఇప్పుడే కాల్ చేయండి త్రివిక్రం కి అంటాడు. వెంకటేష్ అది సరదాగా అన్నా సరే త్రివిక్రం తో సినిమా కోసం తాను ఓకే కానీ అతనే ఆసక్తి చూపించట్లేదన్న భావన ఉంది.

త్రివిక్రం చేయాలని అనుకుంటే ఏ హీరో అయినా డేట్స్ ఇస్తాడు. వెంకటేష్ తో కూడా త్రివిక్రం చేయాలని అనుకుంటే చాలు నెక్స్ట్ డే సినిమా అనౌన్స్ మెంట్ వస్తుంది. అసలైతే వెంకటేష్ లాండ్ మార్క్ మూవీ 75వ సినిమా త్రివిక్రం తో చేస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఆ కాంబోలో కాకుండా శైలేష్ తో సైంధవ్ సినిమా చేశాడు.

త్రివిక్రం వెంకటేష్ కాంబో సినిమా కోసం ఆడియన్స్ అంతా కూడా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కానీ వీరి సినిమాకు ముహూర్తం బయట పడట్లేదు. వెంకటేష్ తరుణ్ భాస్కర్ తో సినిమా కూడా ఎప్పటి నుంచో డిస్కషన్స్ లో ఉంది కానీ అది ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. త్రివిక్రం తో వెంకటేష్ సినిమా చేస్తే మాత్రం అది మరో సెన్సేషనల్ మూవీ అవుతుందని చెప్పొచ్చు.