Begin typing your search above and press return to search.

దేవర 2 కి మేకర్స్ ప్లాన్ అదేనా..?

దేవర సినిమా ప్రతి అభిమాని కాలర్ ఎత్తుకునేలా చేస్తుందని స్వయంగా తారక్ చెప్పడంతో అభిమానుల అంచనాలకు ఆకాశమే హద్ధు అయ్యింది.

By:  Tupaki Desk   |   2 Jun 2024 12:23 PM GMT
దేవర 2 కి మేకర్స్ ప్లాన్ అదేనా..?
X

ఆచార్య ఫ్లాప్ పడినా కొరటాల శివ మీద నమ్మకంతో దేవర ఛాన్స్ ఇచ్చాడు ఎన్.టి.ఆర్. అద్భుతమైన కథ రాసుకుని సెట్స్ మీదకు వెళ్లిన కొన్నాళ్లకే ఈ సినిమా ఒక పార్ట్ గా కాదు రెండు భాగాలుగా చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఎన్.టి.ఆర్ దేవర రెండు భాగాలు అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు మరింత పెరిగాయి. ఇక సినిమా నుంచి వస్తున్న టీజర్స్ అన్ని లెక్కకు మించి అన్నట్టు హైప్ తెస్తున్నాయి. దేవర సినిమా ప్రతి అభిమాని కాలర్ ఎత్తుకునేలా చేస్తుందని స్వయంగా తారక్ చెప్పడంతో అభిమానుల అంచనాలకు ఆకాశమే హద్ధు అయ్యింది.

అక్టోబర్ 10న దేవర ఆగమనం జరుగుతుంది. ఐతే దేవర మొదటి భాగం క్లైమాక్స్ కూడా సెకండ్ పార్ట్ కి అదిరిపోయే లీడ్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు రెండో భాగం వెంటనే రిలీజ్ చేసినా చూసేయాలి అన్న ఎగ్జైట్ మెంట్ ఉంటుందట. దేవర 1 తో పాటుగా వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్.టి.ఆర్ 2025 లో దేవర 2 కి డేట్స్ ఇస్తాడని తెలుస్తుంది. ఈ ఇయర్ చివర్లో ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నాడు.

సో 2025 దేవర 2 ని ఎలాగోలా పూర్తి చేసి 2026 సంక్రాంతికి లేదా సమ్మర్ కి దేవర 2 ని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు దేవర 1 ఎండింగ్ కి దేవర 2 రిలీజ్ డేట్ చెప్పేస్తారని అంటున్నారు. దేవర మొదటి పార్ట్ మాత్రం దసరా బరిలో రికార్డులను టార్గెట్ పెట్టుకుని వస్తుంది. ఎన్.టి.ఆర్ లోని నట విశ్వరూపాన్ని మరోసారి ప్రేక్షకుల ముందు ఉంచేందుకు దేవర వస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

RRR తర్వాత దేవర చేస్తున్న తారక్ గ్లోబల్ వైడ్ గా తనని అభిమానించే ప్రేక్షకులందరిని సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. దేవర ప్రతి విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు. అనిరుద్ మ్యూజిక్ ఇప్పటికే సినిమాపై డబుల్ క్రేజ్ తీసుకు రాగా హీరోయిన్ గా జాన్వి.. విలన్ గా సైఫ్ ఇలా అన్ని అంశాల్లో ది బెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దేవర సినిమాతో దమ్ము చూపించేందుకు వస్తున్న ఎన్.టి.ఆర్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేస్తాడని అంటున్నారు.