Begin typing your search above and press return to search.

పెళ్లి క‌బురు చెబుతాన‌న్న త్రిష!

అప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి ఫేక్ వార్త‌ల‌ను వైర‌ల్ చేయొద్దు! అంటూ త్రిష త‌నపై సాగుతున్న ప్ర‌చారాన్ని ఖండించారు.

By:  Tupaki Desk   |   3 Jun 2024 3:00 AM GMT
పెళ్లి క‌బురు చెబుతాన‌న్న త్రిష!
X

సౌత్ ఇండియా క్వీన్‌ త్రిష పెళ్లి గురించి చాలా పుకార్లు ఉన్నాయి. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభ‌ర' షూటింగ్‌లో బిజీగా ఉన్న త్రిష‌పై మ‌రోసారి పెళ్లి పుకార్లు వైర‌ల్ అవుతున్నాయి. త్రిష తొంద‌ర్లోనే పెళ్లాడ‌బోతోంది! అంటూ ప్ర‌చారం ఊపందుకుంది.

నా పెళ్లి గురించి పుకార్లు ఎక్కువ‌య్యాయి. ఒక‌వేళ అలా ఏదైనా ఉంటే నేను ముందే చెబుతాను. అప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి ఫేక్ వార్త‌ల‌ను వైర‌ల్ చేయొద్దు! అంటూ త్రిష త‌నపై సాగుతున్న ప్ర‌చారాన్ని ఖండించారు. తాను ప్ర‌స్తుతం కెరీర్ పై మాత్ర‌మే దృష్టి సారించాన‌ని కూడా తెలిపారు.

41 ఏళ్ల త్రిషపై గ‌తంలోను పెళ్లి పుకార్లు షికార్ చేసాయి. ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోని పెళ్లాడ‌బోతోంద‌ని ప‌దేళ్ల క్రిత‌మే పుకార్లు షికార్ చేసాయి. ఆ త‌ర్వాత త‌మిళ నిర్మాత కం బిజినెస్ మేన్ వ‌రుణ్ మ‌ణియ‌న్ తో నిశ్చితార్థమయ్యాక కూడా పెళ్లి ఘ‌డియ‌ల‌కు ముందు బ్రేక‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే.

గ‌త ఏడాది మలయాళ సినీ నిర్మాతతో త్రిష‌కు పెళ్లి అంటూ వచ్చిన పుకార్లను కూడా కొట్టిపారేసింది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న త్రిష.. ఇది కేవలం రూమర్ అని ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది. ప్ర‌స్తుతం కమల్ హాసన్ ప్ర‌ధాన పాత్ర‌లో మణిరత్నం తెర‌కెక్కిస్తున్న థ‌గ్ లైఫ్ (KH 234) లో త్రిష న‌టిస్తోంది. చిరుతో ఫాంట‌సీ సినిమా విశ్వంభ‌ర‌లో త్రిష పాత్ర‌కు అధిక ప్రాధాన్య‌త ఉంద‌ని కూడా తెలుస్తోంది.

కోలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న త్రిష కెరీర్ ఇటీవ‌ల‌ పీక్ లో ఉంది. కొన్నేళ్ల విరామం తర్వాత 2022లో `పొన్నియిన్ సెల్వన్`తో తమిళ చిత్రసీమలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత విజ‌య్ స‌ర‌స‌న లియోలో న‌టించింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ది రోడ్ అనే చిత్రంలోను త్రిష న‌టించింది. చిరంజీవి, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జ హీరోల‌తో అవ‌కాశాలు అందుకుని త్రిష ఫుల్ జోష్ తో ఉంది.