Begin typing your search above and press return to search.

లండ‌న్‌లో సెటిల‌వుతున్న అనుష్క‌?

పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాసులతో కూడిన కాస్మోపాలిటన్ హబ్ అయిన లండన్ లో ఈ జంట సెటిల‌య్యే అవ‌కాశం ఉంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి.

By:  Tupaki Desk   |   8 July 2024 3:36 PM GMT
లండ‌న్‌లో సెటిల‌వుతున్న అనుష్క‌?
X

అవును.. అనుష్క లండ‌న్ లో సెటిల‌వ్వ‌బోతోంది. త‌న కుటుంబంతో క‌లిసి ప‌ర్మినెంట్ గా లండ‌న్ లో ఉండాల‌ని నిర్ణ‌యించుకుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇంత స‌డెన్ గా ఈ డెసిష‌న్ దేనికి? అంటే... పూర్తి వివ‌రాల్లోకి వెళ్లాలి.


భారతదేశంలో అత్యంత ప్రియమైన సెలబ్రిటీ జంటలలో ఒకరైన అనుష్క - విరాట్ ఎల్లప్పుడూ తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి చాలా వ‌ర‌కూ గోప్యతను కొనసాగించారు. అయినప్పటికీ వారి షెడ్యూల్‌లు బ‌హిర్గ‌త‌మ‌వుతూనే ఉన్నాయి. ముఖ్యంగా విరాట్ క్రికెట్ కట్టుబాట్ల కార‌ణంగా తరచుగా ప్రపంచాన్ని చుట్టి రావాల్సిన అవసరం ఉంది. ఈ జంట భారతదేశం వెలుపల మరింత ఉత్త‌మ‌మైన‌ శాశ్వత నివాసాన్ని కోరుకుంటుందనే ఊహాగానాలకు ఇటీవ‌ల ప‌రిస్థితులు దారితీసాయి. పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాసులతో కూడిన కాస్మోపాలిటన్ హబ్ అయిన లండన్ లో ఈ జంట సెటిల‌య్యే అవ‌కాశం ఉంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి.

ఈ జంట నుండి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ అనుష్క శ‌ర్మ తాజా పోస్ట్ వెనుక ఉన్న నిజమైన అర్థాన్ని వెలికి తీయాల‌ని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక విషయం క‌చ్చితంగా చెప్పవచ్చు. హై-ప్రొఫైల్ క‌పుల్ క‌చ్ఛితంగా విదేశాల‌లో స్థిర‌ప‌డేందుకు ఆస్కారం ఉంది. ప్ర‌స్తుతం ఈ జంట ఆలోచ‌నలు ఎలా ఉన్నాయి? అన్న‌ది డీకోడ్ చేసేందుకు అభిమానులు ఆస‌క్తిగా ఉన్నారు.

ఇంత‌కీ అనుష్క ఇచ్చిన క్లూ ఏమిటీ? అంటే... త‌న తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో సుందరమైన లండన్ వీధి ఫోటో.. ఒక ఎమోజితో పాటు - ఒక విమానం ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది అనుష్క‌. ఇది ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. అభిమానులు ప్రతిదానికి వివరాలను విడదీసి చూస్తున్నారు. కొందరు బ్రిటీష్ రాజధానికి ఈ జంట షిఫ్ట‌య్యే ఛాన్సుంద‌ని ఊహాగానాలు సాగించారు. అయితే మరికొందరు ఇది కేవ‌లం బ్రాండ్ ఎండార్స్‌మెంట్ లేదా వెకేషన్ స్పాట్‌కు సంబంధించిన వివ‌రం అని భావిస్తున్నారు.