చిన్న బ్రేక్ మాత్రమే: విశ్వక్ సేన్
గామిలో అఘోర శంకర్ గా కనిపించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.
By: Tupaki Desk | 5 July 2024 5:04 PM GMTటాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. 2024లో ఇప్పటికే రెండు చిత్రాలతో అలరించారు. గామిలో అఘోర శంకర్ గా కనిపించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో లంకల రత్నగా సందడి చేశారు. తన ట్యాగ్ కు తగ్గట్లు కనిపించి ఆకట్టుకున్నారు.
ఇటీవల ఆయన మరో మూవీ లైలా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభం అవ్వగా.. మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. మూవీ నుంచి విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కెరీర్ లో తొలిసారి లేడీ గెటప్ లో కనిపించనున్నారు విశ్వక్ సేన్. మెకానిక్ రాకీ మూవీ నుంచి కూడా త్వరలోనే అప్డేట్ రానుంది. ప్రస్తుతం ఆయన చిత్రాలన్నీ సెట్స్ పై ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే.. కొద్ది రోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో సోషల్ మీడియాకు దూరమవుతున్నానని పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత నుంచి అసలు విశ్వక్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా కనపడట్లేదు. ట్విట్టర్ లో మాత్రం ఆయన అకౌంట్ ఉంది. ఇప్పుడు ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించారు విశ్వక్. "అందరికీ హాయ్.. ఇన్ స్టాగ్రామ్ కు చిన్న బ్రేక్ మాత్రమే. దాని కోసం మీరు ఎవరూ చింతించాల్సిన పనిలేదు. నా టీమ్ ఎక్కువగా ట్విట్టర్ ను వాడుతోంది. అందుకే నా ఇన్ స్టా డీయాక్టివేషన్ గురించి ఒత్తిడికి గురికావద్దు" అని తెలిపారు.
"కొద్ది రోజులుగా నా సోషల్ మీడియా అకౌంట్స్ డీయాక్టివేషన్ కోసం చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. అంతా బాగానే ఉందా అని అడుగుతున్నారు. ఇది చాలా ఫన్నీగా ఉంది. సోషల్ మీడియా అకౌంట్స్ పర్సనల్ లైఫ్ ను నిర్వచించలేవు. ఎవరైనా కూడా సోషల్ మీడియాను కొంత వరకు మాత్రమే సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నా" అని పోస్ట్ పెట్టారు విశ్వక్ సేన్.
ప్రస్తుతం ఆయన పోస్ట్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. విశ్వక్ సేన్ నిర్ణయంపై ఫ్యాన్స్, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అస్సలు ఏం జరిగిందని అంటున్నారు. ఇప్పుడు కూడా మాస్ కా దాస్.. కారణం చెప్పకుండా కొద్ది రోజుల పాటు బ్రేక్ ఇస్తానని మాత్రమే తెలిపారు. అసలు కారణమేమిటో ఆయనకే తెలియాలి. మరి విశ్వక్ ఇన్ స్టాలోకి మళ్లీ ఎప్పుడు వస్తారో చూడాలి.