Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : అందాల ఐశ్వర్యం

తాజాగా మరోసారి అందాల ఐశ్వర్యం అనిపించుకునే విధంగా విభిన్నమైన మోడ్రన్‌ ఔట్‌ ఫిట్‌తో ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   17 March 2025 9:00 PM IST
పిక్‌టాక్ : అందాల ఐశ్వర్యం
X

తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు దాటినా అదృష్టం కలిసి రాలేదు. అయితే ఈ పదేళ్ల కాలంలో ఐశ్వర్య మీనన్‌ చాలానే ప్రయత్నాలు చేసింది. తమిళ్‌ చిత్రాలతో పాటు మలయాళం, తెలుగు సినిమాల్లోనూ నటించింది. తెలుగులో ఈమె నటించిన స్పై, భజే వాయు వేగమ్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో తెలుగులో మళ్లీ ఆఫర్ల కోసం ఈమె వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమాను చేస్తుంది. అంతే తప్ప ఆమె నుంచి మరే సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి లేదు.


చూడ్డానికి చక్కగా ఉండి, ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్‌తో పోల్చితే అందం విషయంలో, అభినయం విషయంలో ముందు ఉండే ఐశ్వర్య మీనన్‌ అదృష్టం కలిసి రాకపోవడంతో అంతగా ఆఫర్లు సొంతం చేసుకోలేక పోతుంది. ఆకట్టుకునే అందం ఉన్నా కూడా ఈమెకు ఇప్పటి వరకు బిగ్‌ కమర్షియల్‌ హిట్‌ పడలేదు. కనుక ఇంకా ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ముందు ముందు అయినా ఈమెకు నటిగా వరుసగా ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి. నటిగా గుర్తింపు దక్కించుకోవడం ప్రయత్నాలు చేస్తున్న ఐశ్వర్య మీనన్‌ సోషల్‌ మీడియాలో మాత్రం స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తన అందమైన ఫోటోల కారణంగా రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో 3.2 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఐశ్వర్య మీనన్‌ రెగ్యులర్‌గా షేర్‌ చేసే అందమైన ఫోటోలు, వీడియోల కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి అందాల ఐశ్వర్యం అనిపించుకునే విధంగా విభిన్నమైన మోడ్రన్‌ ఔట్‌ ఫిట్‌తో ఆకట్టుకుంది. సింపుల్‌ అండ్ స్వీట్‌ లుక్‌తో పాటు ఆకట్టుకునే అందం తన సొంతం అన్నట్లుగా ముద్దుగుమ్మ సోషల్‌ మీడియా ద్వారా మెప్పించింది. ఇంతటి అందగత్తె అయినా అదృష్టం కలిసి రాకపోవడంతో ఆఫర్లు అంతగా రావడం లేదు అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఐశ్వర్య మీనన్‌ అందంకు తగ్గ ఆఫర్ల కోసం ఆమె మరింత కాలం వెయిట్‌ చేయాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


తెలుగులో ఈమె చేసిన స్పై సినిమాతో పాటు భజే వాయు వేగమ్ సినిమా నిరాశ పరిచింది. కనీసం ఒక్క సినిమా హిట్ అయినా ఈ అందమైన ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో కనీసం మూడు నాలుగు ఆఫర్లు వచ్చి ఉండేవి. కానీ అదృష్టం కలిసి రాక పోవడంతో ఐశ్వర్య మీనన్ ఇంకా ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈమె అందం చూస్తే మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో సందడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పదేళ్ల కాలంలో అయినా ఐశ్వర్య మీనన్‌ కి స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.