చిత్రపరిశ్రమపై ఐటీ శాఖ దాడులు: రెండవ రోజు ఇలా..
తెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి ఐటీ శాఖ రాడార్లోకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థలపై రెండో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగడం పరిశ్రమలో పెనుదుమారం రేపుతోంది. దాదాపు వంద మంది అధికారులలు మరో రెండు రోజుల పాటు ఈ రెయిడ్స్ లో పాల్గొన బోతున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలు సాధారణ పరిశీలనగా కనిపించినప్పటికీ, దీని వెనుక గల ఆర్థిక పరమైన అంశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. నిర్మాణ సంస్థల ఆర్థిక లావాదేవీలు, పెద్ద మొత్తంలో వచ్చిన వసూళ్లు, వీటికి సంబంధించిన పన్నుల చెల్లింపులపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, అభిషేక్ అగర్వాల్ వంటి టాప్ నిర్మాతల ఇళ్లను, కార్యాలయాలను సోదాలు చేయడం, అలాగే పెద్ద నిర్మాణ సంస్థల పైనే దృష్టి పెట్టడం చూస్తుంటే ఐటి అధికారులకు బలమైన సమాచారం అందే ఉంటుందనే తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప 2 వంటి సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించాయి. అలాగే గేమ్ ఛేంజర్ బఫ్జెట్ ఫైనాన్స్ కు సంబంధించిన లెక్కలపై ఉన్న అనుమానాలే ఈ దాడులకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐటీ శాఖ దృష్టి పెట్టిన మరో అంశం పాన్ ఇండియా చిత్రాల ఆర్థిక వ్యవస్థ. గేమ్ ఛేంజర్ , పుష్ప 2 వంటి తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదిగినప్పటికీ, వీటి లావాదేవీలు సరైన పన్ను చెల్లింపులతో ఉన్నాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా పెద్ద నిర్మాణ సంస్థలతో పాటు, ఈ సినిమాలకు నిధులు సమకూర్చిన ఫైనాన్షియర్‌లపై కూడా సోదాలు జరగడం విశేషం. ప్రస్తుతం ఫైనాన్సింగ్ విధానం పూర్తిగా మారిపోయి, డిజిటల్, ఓటిటి హక్కుల ఆధారంగా నిధుల నిర్వహణ జరుగుతోంది. ఈ పరిణామంలో సత్య రంగయ్య వంటి ప్రముఖ ఫైనాన్సియర్‌లు, మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు వంటి నిర్మాతలు ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహిస్తున్నారు అనే దానిపై ఆదాయ శాఖ దృష్టి పెట్టింది. పుష్ప 2 లాంటి సినిమాలు 2000 కోట్లు నిజంగా కలెక్ట్ చేసిందనే ప్రచారం కూడా ఫోకస్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే సినిమా కోసం భారీ బడ్జెట్లు ఎలా సమకూర్చారనే విషయం కీలకంగా మారింది. ఈ దాడుల వల్ల పరిశ్రమలో ఆర్థిక పారదర్శకతను పెంచే అవకాశముంది. కానీ, మరోవైపు, పెద్ద నిర్మాణ సంస్థలు, ఫైనాన్సియర్‌లు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరిశ్రమ ఆర్థిక వ్యవహారాలను సరళతరం చేయడం, పన్నుల చెల్లింపుల్లో పారదర్శకత చూపడం అనివార్యమని ఐటీ శాఖ ఈ సోదాల ద్వారా సందేశమిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి ఐటీ శాఖ రాడార్లోకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థలపై రెండో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగడం పరిశ్రమలో పెనుదుమారం రేపుతోంది.
By: Tupaki Desk | 22 Jan 2025 6:10 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి ఐటీ శాఖ రాడార్లోకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థలపై రెండో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగడం పరిశ్రమలో పెనుదుమారం రేపుతోంది. దాదాపు వంద మంది అధికారులలు మరో రెండు రోజుల పాటు ఈ రెయిడ్స్ లో పాల్గొన బోతున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలు సాధారణ పరిశీలనగా కనిపించినప్పటికీ, దీని వెనుక గల ఆర్థిక పరమైన అంశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. నిర్మాణ సంస్థల ఆర్థిక లావాదేవీలు, పెద్ద మొత్తంలో వచ్చిన వసూళ్లు, వీటికి సంబంధించిన పన్నుల చెల్లింపులపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, అభిషేక్ అగర్వాల్ వంటి టాప్ నిర్మాతల ఇళ్లను, కార్యాలయాలను సోదాలు చేయడం, అలాగే పెద్ద నిర్మాణ సంస్థల పైనే దృష్టి పెట్టడం చూస్తుంటే ఐటి అధికారులకు బలమైన సమాచారం అందే ఉంటుందనే తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప 2 వంటి సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించాయి. అలాగే గేమ్ ఛేంజర్ బఫ్జెట్ ఫైనాన్స్ కు సంబంధించిన లెక్కలపై ఉన్న అనుమానాలే ఈ దాడులకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐటీ శాఖ దృష్టి పెట్టిన మరో అంశం పాన్ ఇండియా చిత్రాల ఆర్థిక వ్యవస్థ. గేమ్ ఛేంజర్ , పుష్ప 2 వంటి తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదిగినప్పటికీ, వీటి లావాదేవీలు సరైన పన్ను చెల్లింపులతో ఉన్నాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా పెద్ద నిర్మాణ సంస్థలతో పాటు, ఈ సినిమాలకు నిధులు సమకూర్చిన ఫైనాన్షియర్‌లపై కూడా సోదాలు జరగడం విశేషం.
ప్రస్తుతం ఫైనాన్సింగ్ విధానం పూర్తిగా మారిపోయి, డిజిటల్, ఓటిటి హక్కుల ఆధారంగా నిధుల నిర్వహణ జరుగుతోంది. ఈ పరిణామంలో సత్య రంగయ్య వంటి ప్రముఖ ఫైనాన్సియర్‌లు, మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు వంటి నిర్మాతలు ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహిస్తున్నారు అనే దానిపై ఆదాయ శాఖ దృష్టి పెట్టింది. పుష్ప 2 లాంటి సినిమాలు 2000 కోట్లు నిజంగా కలెక్ట్ చేసిందనే ప్రచారం కూడా ఫోకస్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే సినిమా కోసం భారీ బడ్జెట్లు ఎలా సమకూర్చారనే విషయం కీలకంగా మారింది.
ఈ దాడుల వల్ల పరిశ్రమలో ఆర్థిక పారదర్శకతను పెంచే అవకాశముంది. కానీ, మరోవైపు, పెద్ద నిర్మాణ సంస్థలు, ఫైనాన్సియర్‌లు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరిశ్రమ ఆర్థిక వ్యవహారాలను సరళతరం చేయడం, పన్నుల చెల్లింపుల్లో పారదర్శకత చూపడం అనివార్యమని ఐటీ శాఖ ఈ సోదాల ద్వారా సందేశమిస్తోంది.