Begin typing your search above and press return to search.

సుకుమార్‌ పై ఐటీ దాడులు..?

తాజా మీడియా నివేదికల ప్రకారం, దర్శకుడు సుకుమార్ ఇంట్లో నిన్న ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   22 Jan 2025 6:28 AM GMT
సుకుమార్‌ పై ఐటీ దాడులు..?
X

టాలీవుడ్ లో నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థల ఆఫీసులు, నిర్మాతల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు. పలువురు ఫైనాన్సియర్స్ పైనా రెయిడ్స్ జరిగినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం ప్రొడ్యూసర్లు, ఫైనాన్షియర్లపై మాత్రమే ఐటీ దాడులు జరగగా.. ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్‌ మీద కూడా రెయిడ్ నిర్వహిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తాజా మీడియా నివేదికల ప్రకారం, దర్శకుడు సుకుమార్ ఇంట్లో నిన్న ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ మంగళవారం ఉదయం దగ్గర ఉండి సుకుమార్ ను ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి తీసుకుని వెళ్లారట. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తున్నారట. 'పుష్ప 2'తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన సుక్కూ.. ఆ సినిమా నిర్మాణంలో తన బ్యానర్ ను భాగస్వామిగా చేశారు ఈ నేపథ్యంలోనే దర్శకుడి ఇంటిపై ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

'పుష్ప 2: ది రూల్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇది బాక్సాఫీస్ వద్ద 1850 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లుగా మేకర్స్ అధికరికగా ప్రకటించారు. ఐటీ రైడ్స్ జరగడానికి ఇదే కారణమని అంటున్నారు. మైత్రీ మూవీస్ ఆఫీస్, నిర్మాత నవీన్ యెర్నేని, సీఈఓ చెర్రీ ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శక నిర్మాత సుకుమార్ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. దీన్ని బట్టి 'పుష్ప 2'తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ఐటీ శాఖ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ తో పాటుగా దిల్ రాజు ప్రొడక్షన్స్, మ్యాంగో మీడియా, అభిషేక్ అగర్వాల్ సహా పరిశ్రమలోని పలువురు అగ్ర నిర్మాతల నివాసాలు, కార్యాలయాలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి రెండు వరకు ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత కిషోర్ గరికపాటి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారని టాక్. టాలీవుడ్ లో చాలామంది ప్రొడ్యూసర్స్ కు సపోర్ట్ గా ఉండే రిలయన్స్ శ్రీధర్.. సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీ దగ్గరకు కూడా అధికారులు వెళ్ళినట్లుగా వార్తలు వస్తున్నాయి.