Begin typing your search above and press return to search.

300 ద‌ర్శ‌కుడి నుంచి భారీ విజువ‌ల్ ట్రీట్

గెలాక్సీని దాడి నుండి రక్షించడానికి ఒక బృందాన్ని ఏర్పరిచిన కోరా ఎలాంటి సాహ‌సాలు చేసింది? అన్న‌ది తెర‌పైనే చూడాలి.

By:  Tupaki Desk   |   14 Nov 2023 12:30 AM GMT
300 ద‌ర్శ‌కుడి నుంచి భారీ విజువ‌ల్ ట్రీట్
X

300 లాంటి సాంకేతిక అద్భుతాన్ని సృజించిన జాక్ స్నైడ‌ర్ నుంచి మ‌రో సినిమా వ‌స్తోంది అంటే దాని కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తారు. అంత‌కుముందు ఆ త‌ర్వాత కూడా అత‌డి నుంచి వచ్చిన సినిమాల‌న్నీ సంచ‌ల‌నాలే గ‌నుక దీనిపై అంచ‌నాలు ఆ స్థాయిలోనే ఉంటాయి. మ్యాన్ ఆఫ్ స్టీల్ లాంటి మైండ్ బ్లోవింగ్ విజువ‌ల్ ఎక్స్ ట్రావ‌గంజాను అత‌డు అందించాడు. జాక్ స్నైడ‌ర్ అంటే భారీత‌నం నిండిన యుద్ధాలు, టెక్నిక‌ల్ గా అద్భుత‌ ఎలివేష‌న్లు, గొప్ప నేప‌థ్య క‌ళాత్మ‌క‌త‌ చాలా కామ‌న్. అత‌డి సినిమాల్లో ఉర్రూత‌లూగించే కంటెంట్ ఉండి తీరుతుంద‌న్న నమ్మ‌కం అభిమానుల్లో ఉంది. జేమ్స్ కామెరూన్, క్రిస్టోఫ‌ర్ నోలాన్ జాన‌ర్ల‌కు భిన్న‌మైన జాన‌ర్ల‌తో అత‌డు సంచ‌ల‌నాలు సృష్టించారు.

అందుకే ఇప్పుడు స్నైడ‌ర్ నుంచి వ‌స్తున్న వెబ్ సినిమా రెబెల్ మూన్ పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. స్నైడర్ సృజనాత్మకతను ప‌రాకాష్ట‌లో ఎలివేట్ చేస్తున్న ఈ ట్రైల‌ర్ చూడ‌గానే ఒక అంచ‌నాకు రావొచ్చు. క‌థ‌ కోరా (సోఫియా బౌటెల్లా) అనే సాహ‌సికురాలి ధైర్యం యాక్ష‌న్ అంశాల చుట్టూ తిరుగుతుంది. గెలాక్సీని దాడి నుండి రక్షించడానికి ఒక బృందాన్ని ఏర్పరిచిన కోరా ఎలాంటి సాహ‌సాలు చేసింది? అన్న‌ది తెర‌పైనే చూడాలి. సోఫియా బౌటెల్లా, ఎడ్ స్క్రీన్, క్లియోపాత్రా కోల్‌మన్, క్యారీ ఎల్వెస్ త‌దిత‌రులు ఇందులో నటించారు.

స్నైడర్ అభిరుచికి త‌గ్గ ఎలివేష‌న్ల‌తో ఈ ఓటీటీ సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది. ఇక్క‌డ హీరోలు ఉండ‌రు.. ఓన్లీ రెబ‌ల్స్ ఉంటారు! అంటూ అద్భుత‌మైన క్యాప్ష‌న్ ని ట్రైల‌ర్ లో చూపించారు. మృత్యువు తాలూకా సైన్యం ఎలా ఉంటారో ట్రైల‌ర్ చూపించింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. స్నైడర్ ఫిల్మ్ నుండి ఆశించే అన్ని ఎలిమెంట్స్ కి ఇందులో కొద‌వేమీ లేదు. అత‌డు ఎక్కువ‌గా ఇష్టమైన సైన్స్ ఫిక్షన్ క‌థాంశంతో ఈ సినిమా ర‌క్తి క‌ట్టిస్తోంది.

స్టార్ వార్స్, డూన్ లాంటి చిత్రాల‌ను ఇది గుర్తు చేస్తోంది. భారీ తుపాకులు, వెప‌న్స్ తో విరుచుకుప‌డే వీరుల క‌థాంశ‌మిద‌ని అర్థ‌మ‌వుతోంది. స్నైడర్ `రెబెల్ మూన్` కోసం 172-పేజీల స్క్రిప్ట్‌ను రాసాడు. మొదట్లో మూడు గంటలు పైగా ఫిల్మ్ తీయాల‌ని భావించిన స్నైడ‌ర్ ..అనంత‌రం దీనిని రెండు భాగాలుగా విభజించాలని నిర్ణయించుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్ లో దీనికోసం భారీ పెట్టుబ‌డుల‌ను వెద‌జ‌ల్లింద‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. రెబెల్ మూన్ - పార్ట్ వన్: ఎ చైల్డ్ ఆఫ్ ఫైర్ పేరుతో మొదటి భాగం 22 డిసెంబర్ 2023 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది. డిసెంబర్ 17న పరిమిత థియేటర్‌లలో విడుదలవుతుంది. దీని తర్వాత రెండవ భాగం 19 ఏప్రిల్ 2024లో విడుదల అవుతుంది.