Begin typing your search above and press return to search.

బాలీవుడ్ హిట్ మూవీ రీమేక్.. ఆ ఇద్దరు తెలుగు హీరోలు పోటీ!

2023 టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించడం వల్ల కిల్ మూవీ అంతర్జాతీయ సినిమా ప్రముఖుల దృష్టిలో కూడా పడింది.

By:  Tupaki Desk   |   14 July 2024 11:30 AM GMT
బాలీవుడ్ హిట్ మూవీ రీమేక్.. ఆ ఇద్దరు తెలుగు హీరోలు పోటీ!
X

'ఇండియాలో ఇప్పటివరకు ఎవరూ చూడని అత్యంత హింసాత్మక సినిమా' అంటూ ప్రమోషన్స్ జరుపుకున్న బాలీవుడ్ మూవీ కిల్. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, గునీత్ మోంగా, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించిన ఆ సినిమాకు నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. 2023 టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించడం వల్ల కిల్ మూవీ అంతర్జాతీయ సినిమా ప్రముఖుల దృష్టిలో కూడా పడింది.

అయితే ఈ సినిమాను హాలీవుడ్ సూపర్ స్టార్ జాన్ విక్ ఇంగ్లీష్ లో రీమేక్ చేయాలని ఫిక్స్ అవ్వడంతో మూవీపై మరింత బజ్ క్రియేట్ అయింది. లక్ష్య, రాఘవ్ జుయెల్, ఆశిష్ విద్యార్థి, హర్ష్ చాయా, తాన్యా మణిక్ తలా, అభిషేక్ చౌహాన్ కీలక పాత్రలు పోషించిన కిల్ మూవీ.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ కు గాను రూ.11 కోట్ల వసూలు చేసి మంచి విజయం సాధించింది.

ఈ సినిమాలో ఎక్కువ మంది కొత్త నటీనటులు, టెక్నీషియన్లు కనిపించారు. స్టోరీ అంతా ఓ ట్రైన్ లో సాగుతోంది. దీంతో కాస్త భారీగానే నిర్మించారు మేకర్స్. రూ.15 కోట్లకు పైగా వెచ్చించారని సమాచారం. ప్రమోషన్స్ ఎక్కువగా లేకపోయినా మౌత్ టాక్ తో క్లీన్ హిట్ అయిన ఈ మూవీ.. మంచి రివ్యూలు కూడా అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హక్కులను పొందేందుకు ఇద్దరు తెలుగు యంగ్ హీరోలు ట్రై చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

సుధీర్ బాబుతో పాటు కిరణ్ అబ్బవరం టీమ్స్.. కరణ్ జోహార్ సొంత బ్యానర్ అయిన ధర్మ ప్రొడక్షన్స్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళ మార్కెట్‌ లలో కూడా క్లిక్ అయ్యే ఫేమ్ ఉన్న హీరో కోసం కిల్ మేకర్స్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరికి ఆ అవకాశం దక్కుతుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు.

ఇక మూవీ స్టోరీ విషయానికొస్తే.. రైలులో హీరో (జవాన్) తోపాటు ఆయన ప్రేయసి ప్రయాణిస్తారు. అదే సమయంలో వచ్చిన దొంగల ముఠా కత్తులు, తుపాకులతో రైలులో బీభత్సం సృష్టిస్తుంది. జవాన్ ప్రేయసిని ముఠా చంపేస్తుంది. ఆ తర్వాత హీరో చాలా క్రూరంగా మారతారు. ఆ దొంగల ముఠాను అంతం చేసేందుకు నడుం బిగిస్తారు. చివరకు ఏం జరిగిందనేది సినిమా. మరి రీమేక్ లో ఏ హీరో నటిస్తారో వేచి చూడాలి.