Begin typing your search above and press return to search.

డీప్‌ ఫేక్‌... నిందించడం సరి కాదు!

టెక్నాలజీ ఇంతగా ఉండటం ఏ మాత్రం కరెక్ట్‌ కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తే.. కొందరు మాత్రం టెక్నాలజీని తప్పు పట్టడం సరి కాదనడం మనం చూస్తూనే ఉన్నాం.

By:  Tupaki Desk   |   3 Feb 2024 5:30 PM GMT
డీప్‌ ఫేక్‌... నిందించడం సరి కాదు!
X

టెక్నాలజీ పెరిగానా కొద్ది కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. దాంతో చాలా మంది టెక్నాలజీని తప్పు పడుతున్నారు. టెక్నాలజీ ఇంతగా ఉండటం ఏ మాత్రం కరెక్ట్‌ కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తే.. కొందరు మాత్రం టెక్నాలజీని తప్పు పట్టడం సరి కాదనడం మనం చూస్తూనే ఉన్నాం.


తాజాగా డీప్ ఫేక్ వీడియోలు ఫోటోలు క్రియేట్‌ చేస్తూ సెలబ్రెటీలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ మధ్య రాజకీయ నాయకులతో పాటు స్టార్‌ హీరోయిన్ ఫోటోల డీప్‌ ఫేక్ వీడియో లు వైరల్‌ అయ్యాయి. కొందరు డీప్ ఫేక్ వీడియోలతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న విషయం కూడా తెల్సిందే.

డీప్ ఫేక్ వీడియోల వల్ల ఎంతటి నష్టం ఉందో, ఆ టెక్నాలజీ వల్ల అంతకు మించి లాభం కూడా ఉంది. అందుకే డీప్ ఫేక్ టెక్నాలజీని నిందించడం సరి కాదు అంటూ బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ కృతి సనన్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ అమ్మడు 'తేరీ బాతో మై ఐసా ఉల్జా జియా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 9న విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో షాహిద్ కపూర్ తో కలిసి పాల్గొంది. ఆ సమయంలోనే కృతి సనన్ డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి పై విధంగా స్పందించింది.

టెక్నాలజీని నిందించకుండా దాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చాలా మంది కూడా కృతి సనన్ యొక్క వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారు. సోషల్‌ మీడియాలో కృతి సనన్ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.