దీన్ని కచ్చితంగా పాన్ వలర్డ్ మూవీ అనాల్సిందే
ఫలితం పక్కన పెడితే పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోల సినిమాలు విడుదల చేయడం ద్వారా తమ మార్కెట్ ను పెంచుకుంటూ ఉన్నారు.
By: Tupaki Desk | 21 Nov 2023 5:51 AM GMTఈ మధ్య కాలంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోల అన్ని సినిమాలు కూడా సౌత్ లో నాలుగు భాషల్లో మరియు హిందీలో రిలీజ్ అవుతున్నాయి. ఫలితం పక్కన పెడితే పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోల సినిమాలు విడుదల చేయడం ద్వారా తమ మార్కెట్ ను పెంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సౌత్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్లబోతుంది.
ఇండియన్ భాషలతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా సూర్య తాజా చిత్రం 'కంగువ' ను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే సమ్మర్ లో విడుదల అవ్వబోతున్న కంగువ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ముగింపు వచ్చిందని, త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ తో పాటు తమిళ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. బాహుబలిని బీట్ చేసే విధంగా ఈ సినిమాలోని వీఎఫ్‌ఎక్స్ ఉంటాయని మేకర్స్ బలంగా చెబుతున్నారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం బడ్జెట్ లో మెజార్టీ బాగం ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.
ఇది ఒక ఇండియన్ సినిమా అన్నట్లుగా కాకుండా యూనివర్శిల్ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నారట. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 38 భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ మధ్య కాలంలో అయిదు పది భాషల్లో మన ఇండియన్ సినిమాలు విడుదల అవ్వడం జరుగుతుంది. కానీ ఏకంగా 38 భాషల్లో విడుదల అవ్వడం అనేది కచ్చితంగా స్పెషల్.
ఈ రేంజ్ లో విడుదల అవుతుంది కనుక కంగువ సినిమాను పాన్ వరల్డ్ మూవీ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు. ఈ సినిమా లో సూర్య కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. దాదాపుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మిస్తున్నారట. దేవి శ్రీ ప్రసాద్ ఈ పాన్ వరల్డ్ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు.