Begin typing your search above and press return to search.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌కి ఇది టెన్ష‌న్ పెట్టేదే!

మ‌హా ఇరికించ‌గ‌ల్గితే హీరో-హీరోయిన్ కి మ‌ధ్య ఓ రొమాంటిక్ సాంగ్ త‌ప్ప‌ని స‌రి అవుతుంది.

By:  Tupaki Desk   |   16 Dec 2023 11:26 AM GMT
మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌కి ఇది టెన్ష‌న్ పెట్టేదే!
X

ఒక‌ప్పుడు సినిమా అంటే క‌థ‌తో పాటు క‌థానుగుణంగా ఓ ఆరు పాట‌లు..నాలుగైదు యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. క‌థ‌ను బ‌లంగా చెప్పే ప్రోస‌స్ లో పాట‌ల‌కు ప్రాధాన్య‌త త‌గ్గుతుంది. ఒక‌వేళ పాట‌లు ఉన్నా! అవి టైటిల్స్ ట్రాక్స్ గానూ....బ్యాక్ గ్రౌండ్ లో మాత్ర‌మే క‌నిపిస్తు న్నాయి. అది స్టోరీ ట్రావెల్ అవుతున్న‌ప్పుడు వ‌స్తోన్న పాట‌లు. మ‌హా ఇరికించ‌గ‌ల్గితే హీరో-హీరోయిన్ కి మ‌ధ్య ఓ రొమాంటిక్ సాంగ్ త‌ప్ప‌ని స‌రి అవుతుంది.

ఆ పాట‌లోనూ జోడీ ఎంతో రియ‌లిస్టిక్ గా పెర్పార్మెన్స్ చేయ‌గ‌ల‌గాలి. డైరెక్ట‌ర్ పెట్టే కండీష‌న్ కి ఒప్పుకుంటే ఆ పాట‌కి ఛాన్స్ ఉంటుంది. లేదంటే సాంగ్ స్కిప్. 'అర్జున్ రెడ్డి'...'యానిమ‌ల్' సినిమాల కోసం సందీప్ రెడ్డి వంగా అదే స్ట్రాట‌జీని ఫాలో అయ్యాడు. అలాగే చందు మొండేటి కూడా కార్తికేయ ప్రాంచైజీ కోసం పాట‌లు జోప్పించింది లేదు. అత‌ను సీరియ‌స్ గా క‌థ‌ను న‌డిపే ద‌ర్శ‌కుడు త‌ప్ప‌! అతిగా పాట‌ల‌కు ఛాన్స్ ఇవ్వ‌డు.

ఇంకా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్...యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రాల్లో కూడా చాలా మంది ద‌ర్శ‌కులు పాట‌లు తీసుకోవ‌డం లేదు. పాట‌ల‌కు కేటాయించాల్సిన స‌మ‌యాన్ని బ్యాక్ గ్రౌండ్ కేటాయించండ‌ని సంగీత ద‌ర్శ‌కుల్ని కోరుతు న్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ జాన‌ర్ సినిమాల‌కి అత్యంత కీల‌కం కాబ‌ట్టి వాటితో ది బెస్ట్ ఇవ్వ‌గ‌ల గాలి. క్వాలిటీ స్కోర్ తో పాటు...ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేయ‌గ‌లిగే నేప‌థ్య సంగీత‌మే ద‌ర్శ‌కులు కోరుకుంటున్నారు.

రాను రాను ఈ విధానం మ‌రింత బ‌లంగా అమ‌లులోకి రానుంది. కంటెంట్ బేస్డ్ చిత్రాలు ఎక్కువవు తున్నాయి. సినిమా నిడివి పెరిగిపో తుంది. రెండున్న‌ర గంట‌ల నిడివి మెల్ల‌గా మూడు గంట‌ల‌కు తీసుకెళ్లారు. ఆ నిడివి ఇంకా పెర‌గడానికి అవ‌కాశం ఉంది. క‌థ‌ని చెప్ప‌డానికి స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌ని చాలా మంది ద‌ర్శ‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ప్రేక్ష‌కులు కూడా వెబ్ సిరీస్ లు..ఓటీటీ సిరీస్ ల‌కు అల‌వాటు ప‌డుతున్నారు.

దీంతో నిడివి ఎక్కువ‌వుతోంది అన్న విమర్శ క‌నుమ‌రు గ‌వుతుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన `యానిమ‌ల్` కి నిడివి అస‌లు స‌మ‌స్యే కాదంటూ! ప్రేక్ష‌కులే అభిప్రాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు రిలీ జ్ అయిన `బాహుబ‌లి`..`కేజీఎఫ్`..`పుష్ప‌` లాంటి చిత్రాల నిడివిపైనా విమ‌ర్శ‌లు రాలేదు. ఈ నేప‌థ్యం లో మ్యూజిక్ డైరెక్ట‌ర్లు కూడా సాంగ్స్ ప‌రంగా బెస్ట్ ఇవ్వ‌డం కంటే ఆర్ ఆర్ లో ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డిన‌ట్లే.