ఇదే కొనసాగితే.. లియో ఓపెనింగ్స్‌కు పెద్ద దెబ్బే!
ఖైదీ, విక్రమ్ చిత్రాలతో ఫిదా అయిపోయిన తెలుగు ప్రేక్షకులు.. లోకేశ్‌పై నమ్మకంతో లియో ప్రచార చిత్రాలతో కూడా బాగా కనెక్ట్ అయిపోయారు.
By: Tupaki Desk | 14 Oct 2023 11:08 AM GMTమొన్నటి వరకు దళపతి విజయ్ నటించిన వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ లియోపై ఉన్న భారీ అంచనాలు... ప్రస్తుతం రోజురోజుకు తగ్గుతున్నాయి. సోషల్ మీడియా నెగటివ్ ప్రచారం ఎక్కువవుతోంది. అందుకు కారణం ట్రైలర్‌తో పాటు ఇతర అంశాలు. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాళ్లోకి వెళితే.. తమిళంలోనే కాదు తెలుగులోనూ లియో సినిమాకు మొదటి నుంచి మంచి హైప్ కనిపించింది. ఈ దసరాకు బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు లాంటి భారీ సినిమాలు వస్తున్నప్పటికీ.. లియోపై అంతకుమించి క్రేజ్ నెలకొంది. మరీ ముఖ్యంగా దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సినిమా కావడం, మ్యూజిక్ సెన్సేషన అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడం వల్ల ఆ క్రేజ్ మరింత పెరిగింది.
ఖైదీ, విక్రమ్ చిత్రాలతో ఫిదా అయిపోయిన తెలుగు ప్రేక్షకులు.. లోకేశ్‌పై నమ్మకంతో లియో ప్రచార చిత్రాలతో కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. అదే సమయంలో జైలర్ సినిమాకు సెన్సేషనల్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన అనిరుధ్.. లియోకు కూడా అదే మ్యాజిక్ చూస్తారని భారీ అంచనాలను పెంచేసుకున్నారు.
కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అంచనాలను అందుకోలేదు. దీంతో లియోపై నెగటివిటీ మొదలైంది. అంచనాలు తగ్గుతూ వస్తున్నాయి. కేవలం ట్రైలర్ చూసి సినిమా అంచనాకు రావొద్దని, సినిమాలో అనేక సర్ప్రైజ్‌లు ఉన్నాయని మూవీటీమ్ చెబుతున్నప్పటికీ.. అంచనాలు తగ్గుతున్నాయి.
దీనికి తోడు ఈ సినిమా ఎల్‌సీయూలో భాగం కాదని, ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్‌కు ఫ్రీమేక్ అనే ప్రచారం ఎక్కువ సాగడం కూడా మైనస్‌గా మారింది. తాజాగా లియో నుంచి విడుదలైన నే రెడీ పాట కూడా అంతగా ఆకట్టుకోలేదు. అనిరూమ్ మ్యూజిక్ మ్యాజిక్ చేయలేకపోయింది. సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న నాగవంశీ కూడా పెద్దగా మాట్లాడట్లేదు. దీంతో హైప్ అంతకంతకూ తగ్గుతూ పోవడంతో అభిమానుల అంచనాలు తగ్గుతున్నాయి. తెలుగులో మూవీ రిజల్ట్‌పై సందేహాలు కూడా నెలకొంటున్నాయి. ఇవన్నీ ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపేలా ఉన్నాయి.