దాండియా నేర్చుకున్న ఇవాంక ట్రంప్
By: Tupaki Desk | 4 March 2024 5:04 AM GMTఆసియాలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహం కోసం నిర్వహించిన ప్రీ-వెడ్డింగ్ పార్టీకి హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుని కుమార్తె ఇవాంకా ట్రంప్ సంప్రదాయ భారతీయ జానపద నృత్యాన్ని అభ్యసిస్తూ మనోహరంగా కదులుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇవాంకా ఇతర మహిళా అతిథులతో కలిసి దాండియా నృత్య ప్రదర్శన లో పాల్గొంది. రంగురంగుల చిడతలు (చెక్క కర్రలు) చేతపట్టి ఒకదానికొకటి రిథమిక్ బీట్స్‌లో తాకిస్తూ గిరగిరా తిరుగుతూ చేసే ఈ అందమైన సాంప్రదాయ నృత్యం ప్రపంచ వీక్షకులను ఆకర్షించింది. ఇక ఇందులో గర్భా నృత్యం ఎంతో ప్రత్యేకమైనది. ఈ నృత్యం పశ్చిమ భారత రాష్ట్రం గుజరాత్ నుండి ఉద్భవించింది.మతపరమైన వేడుకలు సహా ఇతర ప్రత్యేక సందర్భాలలో ప్రదర్శిస్తారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో.. సాంప్రదాయ గుజరాతీ పాట సెటప్‌లో ఆకర్షించింది. ఇవాంక సొగసైన తెల్లటి దుస్తులలో జానపద నృత్యంలో పాల్గొనడమే గాక అందంగా నవ్వుతూ కనిపించింది. ఇవాంక ఈవెంట్లో తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ``ట్రంప్ కుమార్తె ఇవాంక భారతదేశంలో గార్బాను ఆస్వాధిస్తోంది. సచ్ ఎ ప్రౌడ్ మూవ్‌మెంట్స్ అంటూ`` భారత జెండా ఈమోజీ, నవ్వుతున్న ఈమోజీలను షేర్ చేసారు.
ఇవాంక తన భాగస్వామి జారెడ్ కుష్నర్ వారి కుమార్తె అరబెల్లా రోజ్ కుషెర్‌తో కలిసి ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో ఇవాంకా మెరిసే వెండి బంగారు చీరలో అద్భుతంగా కనిపించగా, సాంప్రదాయ నలుపు నెహ్రూ జాకెట్‌ను ధరించారు.
గుజరాత్ జామ్‌నగర్‌లో బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ (28) ప్రీవెడ్డింగ్ వేడుకల్ని ప్లాన్ చేసారు. జులైలో ఈ వివాహం జరగనుంది. సంపన్న ఫార్మాస్యూటికల్ మొగల్‌ల కుమార్తె రాధిక మర్చంట్‌ను అనంత్ పెళ్లాడుతున్నారు.
ఇతర అతిథులలో బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, బ్లాక్‌రాక్ సహ వ్యవస్థాపకుడు లారీ ఫింక్, ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్, కెనడియన్ మాజీ PM స్టీఫెన్ హార్పర్, మాజీ ఆస్ట్రేలియన్ PM కెవిన్ రూడ్ వేడుకలో సందడి చేసారు. భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన గాయకులలో ఒకరైన దిల్జిత్ దోసాంజ్ ప్రదర్శన.. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ , అమీర్ ఖాన్ ల ప్రదర్శన ఈ వేదిక వద్ద హైలైట్ గా నిలిచాయి.