Begin typing your search above and press return to search.

హై వోల్టేజ్ 'జాట్'.. రిలీజ్ డేట్ ఫిక్స్!

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ యాక్షన్ లెజెండ్ సన్నీ డియోల్ తొలిసారి కలిసి పనిచేస్తున్న సినిమా జాట్.

By:  Tupaki Desk   |   24 Jan 2025 6:11 AM GMT
హై వోల్టేజ్ జాట్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
X

టాలీవుడ్ మాస్ దర్శకుడు గోపిచంద్ మలినేనికి స్టార్ హీరోలను కమర్షియల్ గా ఎలా హైలెట్ చేయాలో బాగా తెలుసు. క్రాక్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన ఈ దర్శకుడు బాలకృష్ణతో వీరసింహా రెడ్డి సినిమాతో మరో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ తో మరో హై వోల్టేజ్ మాస్ యాక్షన్ సినిమాతో రెడీ అవుతున్నాడు.


గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ యాక్షన్ లెజెండ్ సన్నీ డియోల్ తొలిసారి కలిసి పనిచేస్తున్న సినిమా జాట్. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు అభిమానుల్లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ హై వోల్టేజ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమా 2025, ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ సన్నీ డియోల్ మాస్ యాక్షన్ అవతారాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. తన భుజంపై భారీ తుపాకీ, వెనుక హెలికాప్టర్, గాల్లో ఎగురుతున్న కరెన్సీ నోట్లు, స్టైలిష్ షేడ్స్ తో సన్నీ డియోల్ లుక్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూసిన వెంటనే ఓ వర్గం ఆడియెన్స్ లో సాలీడ్ హైప్ క్రియేట్ అవుతోంది. సన్నీ డియోల్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా భారీ యాక్షన్ ఫెస్టివల్ కానుంది.

ఇటీవలి కాలంలో రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. పుష్ప 2 తో కలిపి 12,500 స్క్రీన్‌లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ టీజర్ రికార్డు స్థాయి వ్యూస్‌తో దుమ్మురేపింది. సన్నీ డియోల్ మళ్లీ తన యాక్షన్ స్టార్ ఇమేజ్‌ని గుర్తుచేస్తూ, ఈ సినిమాతో తిరిగి మరో రికార్డ్ ను అందుకోనున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ డియోల్ తో పాటు రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయ్యామి ఖేర్, రెజీనా కసాండ్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రతీ పాత్రకు ఉన్న ప్రాధాన్యతతో దర్శకుడు గోపిచంద్ మలినేని మరోసారి తన స్క్రీన్ ప్లే పవర్ చూపించబోతున్నారు. జాట్ సినిమాకి థమన్ ఎస్ సంగీతం అందించగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ అందించగా, యాక్షన్ కొరియోగ్రఫీ అనిల్ అరసు, రామ్-లక్ష్మణ్, వెంకట్ వంటి దిగ్గజ యాక్షన్ మాస్టర్స్ చేతుల్లో జరుగుతోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని సమాచారం. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.