Begin typing your search above and press return to search.

ఆ హీరోతో గోపీచంద్ అటెంప్ట్ ఎలా ఉండ‌బోతుంది?

మాస్ క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని బాలీవుడ్లో `జాత్` సినిమాతో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు హీరోల్ని డైరెక్ట్ చేసిన మ‌లినేని హిందీ హీరోల‌పై ప‌డ్డాడు.

By:  Tupaki Desk   |   1 Dec 2024 6:49 AM GMT
ఆ హీరోతో గోపీచంద్ అటెంప్ట్ ఎలా ఉండ‌బోతుంది?
X

మాస్ క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని బాలీవుడ్లో `జాత్` సినిమాతో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు హీరోల్ని డైరెక్ట్ చేసిన మ‌లినేని హిందీ హీరోల‌పై ప‌డ్డాడు. ప్ర‌స్తుతం అత‌డి దర్శ‌క‌త్వంలో స‌న్నిడియోలో హీరోగా `జాత్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ అయిన నాటి నుంచి బ‌జ్ క్రియేట్ అవుతుంది. తాజాగా టీజ‌ర్ కూడా సిద్ద‌మైంది.

టీజ‌ర్ సెన్సార్ కూడా పూర్త‌యింది. U/A స‌ర్టిఫికెట్ జారీ అయింది. 88 సెకెన్ల నిడివితో టీజ‌ర రెడీ అయింది. త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. ఇది ప‌క్కా మ‌లినేని మార్క్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని వినిపిస్తుంది. స‌న్నిడియోల్ అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ఇచ్చేలా యాక్ష‌న్ స‌న్నివేశాలు తీర్చి దిద్దిన‌ట్లు...టీజ‌ర్ క‌ట్ లో కొన్నింటిని రివీల్ చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది. మ‌రి హీరోని తెలుగు హీరోని హైలైట్ చేసిన‌ట్లే చేస్తున్నాడా? కొత్త‌గా ఏదైనా ట్రై చేస్తున్నాడా? అన్న‌ది చూడాలి.

ఇప్ప‌టి వ‌ర‌కూ గోపీచంద్ ఎక్కువ‌గా ర‌వితేజ సినిమాల‌కే డైరెక్ట‌ర్ గా ప‌నిచేసాడు. డాన్ శీను, బ‌లుపు, క్రాక్ చిత్రాల‌తో మాస్ రాజాతో తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. వెంక‌టేష్ తో బాడీగార్డ్, రామ్ తో పండ‌గ చేస్కో, బాల‌కష్ణ‌తో వీర‌సింహారెడ్డి చిత్రాల‌తో హిట్ అందుకున్న ట్రాక్ గోపీచంద్ కి ఉంది. ఈ సినిమాల‌న్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. మాస్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. మ‌రి `జాత్` కూడా ఇలాగే ఉంటుందా? త‌న ఫార్ములాని బాలీవుడ్ కి తీసుకెళ్తున్నాడా? లేక కొత్త‌గా ట్రై చేస్తున్నాడా? అన్న‌ది చూడాలి.

ఈ సినిమాకి ఫ‌స్ట్ క్లాస్ టెక్నీషియ‌న్లు ప‌నిచేస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఇది సినిమాకి ప్లస్ అవుతుందని శ్రోత‌లు కాన్పిడెంట్ గా ఉన్నారు. అలాగే రిషీ పంజాబ్ సినిమాటోగ్ర‌ఫీ , న‌వీన్ నూలి ఎడిట‌ర్ గా పిచేస్తున్నారు. అన్ల్‌ అరసు, రామ్‌ లక్ష్మణ్‌, పీటర్‌ హెయిన్‌ యాక్షన్‌ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఈ సినిమా అన్ని ప‌నులు పూర్తి చేసుకుని జనవరి 26, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగులో కూడా చిత్రీకరిస్తున్న ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయ‌నున్నారు.