ఆ ఇద్దరిలో సౌత్ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టే నార్త్ స్టార్ ఎవరు?
సహజంగానే ఆ ఇద్దరిలో ఎవరు ఆన్ ద స్క్రీన్ బెస్ట్ గా కనిపిస్తున్నారు? అనే చర్చ అభిమానుల్లో ఉంటుంది.
By: Tupaki Desk | 26 March 2025 10:30 PMఇద్దరు పెద్ద స్టార్లు నటించిన భారీ చిత్రాలు త్వరలో విడుదలకు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. సహజంగానే ఆ ఇద్దరిలో ఎవరు ఆన్ ద స్క్రీన్ బెస్ట్ గా కనిపిస్తున్నారు? అనే చర్చ అభిమానుల్లో ఉంటుంది.
ఆ కోవలో చూస్తే ఇప్పుడు ఆ ఇద్దరు స్టార్లలో సల్మాన్ కంటే సన్నీడియోల్ బెటర్ అని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ క్రెడిట్ మాత్రం కచ్ఛితంగా ఒక తెలుగు దర్శకుడికి దక్కుతుంది. తమిళ దర్శకుడు మురుగదాస్ తో పోలిస్తే గోపిచంద్ మలినేని తన సినిమాలో క్రియేటివిటీ చూపిస్తున్నాడని, అంతో ఇంతో యాక్షన్ సీక్వెన్సుల్లో అయినా క్రియేటివిటీ చూపించాడని విశ్లేషిస్తున్నారు. దానికి కారణం తాజాగా విడుదలైన జాట్ టీజర్. సన్నీడియోల్ కథానాయకుడిగా గోపిచంద్ మలినేని భారీ యక్షన్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గదర్ 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత సన్నీడియోల్ చాలా తెలివిగా సౌత్ దర్శకుడు గోపిచంద్ మలినేని, సౌత్ నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ కి టచ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఈ కలయిక క్రేజీగా మారింది. అటు నార్త్ కంటే ఎక్కువగా ఇప్పుడు సౌత్ లో సన్నీడియోల్ పేరు మార్మోగుతోందంటే, దానికి కారణం కచ్ఛితంగా గోపిచంద్ మలినేని నుంచి వస్తున్న ఈ సినిమా విజువల్స్.
`జాట్`లో ఏదో సంథింగ్ ఉందన్న క్యూరియాసిటీని టీజర్ ఇప్పటికే ఇచ్చింది. మరోవైపు సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న `సికందర్` ప్రచార కంటెంట్ క్యూరియాసిటీని పెంచడంలో పూర్తిగా విఫలమైంది. సల్మాన్ భాయ్ ని యాక్షన్ అవతార్ లో ప్రెజెంట్ చేస్తున్న మురుగదాస్ .. పూర్తి రొటీన్ కంటెంట్ తో పాత స్కూల్ లో వెళుతున్నాడని విమర్శలొస్తున్నాయి. `సికందర్` ట్రైలర్ తో పోలిస్తే `జాట్` విజువల్స్ ఇప్పటికే ఆసక్తిని పెంచాయి. వాటిలో కొంతైనా కొత్తదనం ఉందన్న ప్రశంసలు కురుస్తున్నాయి. కొంచెమైనా క్రియేటివిటీ లేని ట్రైలర్ ని కొంతైనా కొత్తదనం ఉన్న టీజర్ డామినేట్ చేసిందంటూ ప్రచారం సాగుతోంది. మొత్తానికి తమిళ స్టార్ డైరెక్టర్ పై తెలుగు దర్శకుడి డామినేషన్ స్పష్ఠంగా కనిపిస్తోంది. అలాగే సల్మాన్ లాంటి లీడింగ్ హీరో కంటే సన్నీడియోల్ పై చేయి సాధించడం ఆసక్తిని కలిగిస్తోంది. సికందర్ వర్సెస్ జాట్.. పోటీ కేవలం పది రోజుల గ్యాప్ లోనే ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సికందర్ ఈద్ కానుకగా విడుదలవుతుంటే పది రోజుల గ్యాప్ లోనే జాట్ విడుదల కానుంది.