చూడలేదంటారు..కానీ మాటల్లో దొరికిపోతారు!
'జబర్దస్త్' ఆర్టిస్టులంటే తెలియని వారు ఉండరు. ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకూ అందరూ వాళ్లను గుర్తు పడ తారు.
By: Tupaki Desk | 24 Dec 2024 4:30 PM GMT`జబర్దస్త్` ఆర్టిస్టులంటే తెలియని వారు ఉండరు. ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకూ అందరూ వాళ్లను గుర్తు పడతారు. ఆ షోతో వాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. మార్కెట్ లో వాళ్లకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ అయింది. అదే గుర్తింపు తో దేశ, విదేశాల్లో షోలు కూడా చేస్తున్నారు. వాళ్లు జనాల్లోకి వెళ్తే అభిమానులు సెల్పీలు దిగుతారు. సినిమా ఈవెంట్లకు హాజరైతే స్టార్ హీరోల సైతం వాళ్ల గురించి వేదికలపై మాట్లాడుతుంటారు.
చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ల నుంచి తర్వాత తరం హీరోలెందరో? వాళ్ల ప్రతిభను గుర్తించారు. అవకాశం ఉంటే వాళ్ల సినిమాల్లో కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటి జబర్దస్త్ ఆర్టిస్టులు సినిమా ఆఫీస్ లకు వెళ్తే? మాత్రం అక్కడ ఉండే కొంతమంది మేనేజర్లు, హీరోలతో చనువుగా ఉండేవారు, ఆఫీస్ లో కీలక బాధ్యతలు నిర్వహించే వారికి మాత్రం వాళ్లెవరో తెలియనట్లే వ్యవహరిస్తారు? అన్న సంగతి ఓ ఆర్టిస్ట్ ఆవేదనలో బయట పడింది.
వాళ్లు సినిమా అవకాశం కోసం వచ్చారని తెలిసి! ముందుగా ఆ ముఖాన్ని ఎక్కడా చూడనట్లు ప్రవర్తిస్తారుట. జబర్దస్త్...ఏ ఛానల్ లో వస్తుంది? అందులో ఎవరు నటిస్తారు? ఏమో నేను ఎప్పుడు చూడను. అందులో ఎవరు నటి స్తారో తెలియదంటారుట. వాళ్లే తిరిగి మళ్లీ నాగబాబు, రోజా హోస్ట్ లు కదా? వాళ్లింకా చేస్తున్నారా? లేదా? అని పుసుక్కున నోరు జారుతారుట. కానీ ఆ షోలో నటించే వాళ్లు మాత్రం తెలియదంటారట.
అయితే ఇదంతా వాళ్లు చేసే యాక్టింగ్ అని, వాళ్లంతా కావాలనే అలా ప్రవర్తిస్తారని ఓ నటుడు అన్నాడు. వాళ్లంతా ఎంతో ఎదిగే వాళ్లను చూసి ఓర్వలేక అలా అవమానించే ప్రయత్నం చేస్తారన్నాడు. వాళ్లకు ఎలాగూ ఏ ట్యాలెంట్ ఉండదు. ఆ స్థాయిని దాటి బయటకు రాలేదు. కానీ ట్యాలెంట్ ఉన్న వారు? ఎదురు పడే సరికి వాళ్లను ఎలా తొక్కాలి అనే ఆలోచన వెంటనే వాళ్లకు కలుగుతుందన్నారు. అయినా ట్యాలెంట్ ను ఎవరూ ఆపలేరు. ఆసల్యమైనా అది ఏదో రోజూ బయట పడుతుందని...అంత వరకూ వెయింట్ చేయాలని సదరు నటుడు అభిప్రాయ పడ్డాడు.