Begin typing your search above and press return to search.

వైష్ణవి చైతన్యతో సిద్ధు.. ఓ ముద్దు కోసం ఇలా.

ఈ క్రమంలో తాజాగా ‘జాక్’ నుంచి ‘కిస్ సాంగ్’ విడుదలైంది. ఇక హైదరాబాద్ లోనే ఈ లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

By:  Tupaki Desk   |   20 March 2025 6:57 AM
వైష్ణవి చైతన్యతో సిద్ధు.. ఓ ముద్దు కోసం ఇలా.
X

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘కొంచెం క్రాక్’ అనే క్యాచీ ట్యాగ్ లైన్‌తో మరింత ఆసక్తి పెంచుతున్నారు. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి.


ఈ క్రమంలో తాజాగా ‘జాక్’ నుంచి ‘కిస్ సాంగ్’ విడుదలైంది. ఇక హైదరాబాద్ లోనే ఈ లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. విడుదలైన క్షణాల్లోనే ఈ సాంగ్ ట్రెండింగ్‌లోకి ఎక్కింది. ఇప్పటికే టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు ‘కిస్ సాంగ్’ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. పాటకు సంబంధించిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.

సాంగ్ విషయానికి వస్తే, ‘జాక్’ తన ప్రేయసితో ఓ ముద్దు కోసం ప్రైవసీగా ఉండే చోటు వెతుకుతున్నట్లు కనిపిస్తోంది. ఆ వేదికగా ఓ సినిమా థియేటర్‌ను ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. అల్లరి టచ్‌తో కూడిన ఈ రొమాంటిక్ మెలొడీ పాట యువతను బాగా ఆకట్టుకునేలా ఉంది. సిద్ధు-వైష్ణవి కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా, సనోరే లిరిక్స్ అందించారు. జావేద్ అలీ, ఆమల చెబోలు గాత్రం ఈ పాటకు ప్రత్యేకమైన అందం తెచ్చిపెట్టింది.

పాట విజువల్స్ పరంగా స్టైలిష్‌గా, కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది. రాజు సుందరం కొరియోగ్రఫీని సమకూర్చిన ఈ పాటలో సిద్ధు యాక్టింగ్ సహజంగా ఉంది. వైష్ణవి చైతన్య లుక్స్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో క్యాప్చర్ చేసిన లొకేషన్స్‌ కూడా మంచి ఫీల్‌ను అందించాయి. మొత్తానికి, ‘కిస్ సాంగ్’ లవ్ అండ్ ఫన్ టచ్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ఏప్రిల్ 10న రాబోతున్న ‘జాక్’ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఇక జాక్ సినిమా కేవలం రొమాంటిక్ లవ్ స్టొరీ గానే కాకుండా ఒక హై వోల్టేజ్ యాక్షన్ టచ్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ కంప్లీట్ గా తన స్టైల్ కు భిన్నంగా తెరకెక్కిస్తున్నట్లు అర్ధమవుతుంది. సినిమాకు సంబంధించిన అన్ని పనులు ముగిశాయి. ఇక రిలీజ్ డేట్ విషయంలో మార్పులు చేసే ఆ అవకాశం ఉన్నట్లు ఆమధ్య టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదు. ప్రస్తుతం మేకర్స్ పక్కా ప్రణాళికతో అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు వస్తున్నారు.