పెళ్లితో షాకిచ్చిన నటి.. ఫస్ట్ క్రష్ ఆమెపైనే.. నటుడి వేదన!
సహోద్యోగులతో ప్రేమలో పడటం వర్క్ ప్లేస్ లో చాలా సహజం. గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో ఈ క్రష్‌లు, ప్రేమలకు కొదవేమీ ఉండదు.
By: Tupaki Desk | 4 March 2025 9:23 AM ISTసహోద్యోగులతో ప్రేమలో పడటం వర్క్ ప్లేస్ లో చాలా సహజం. గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో ఈ క్రష్‌లు, ప్రేమలకు కొదవేమీ ఉండదు. ఇలాంటివి పెళ్లయి, పిల్లలు పుట్టి చాలా దూరం వచ్చాక కూడా మనసులను వదిలిపోవు. అలాంటి ఒక లవ్ గురించి బహిరంగంగా చెప్పాడు సీనియర్ నటుడు, ఎయిటీస్ క్లాస్ స్టార్ జాకీ ష్రాఫ్.
అతడు 80ల నాటి సౌత్ స్టార్లకు సన్నిహితుడు. వారితో పార్టీల్లో ఎక్కువగా కనిపిస్తుంటాడు. జాకీకి సౌత్ లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, సుహాసిని, సుమలత సహా చాలామంది స్టార్లతో సత్సంబంధాలున్నాయి. అతడు ఎయిటీస్ స్టార్స్ మీటింగులను అస్సలు స్కిప్ కొట్టడు. నాటితరం స్టార్ల ఫ్యామిలీ ఫంక్షన్ లను అస్సలు మిస్ చేయడు.
అయితే అతడు తన లైఫ్ లో పెళ్లికి ముందు ఒక అందమైన కథానాయికతో తొలి చూపు ప్రేమలో పడ్డానని చెప్పాడు. ఆమె మరెవరో కాదు ఎయిటీస్ అగ్ర కథానాయిక, ది గ్రేట్ మాధురి ధీక్షిత్. మేటి నర్తకి, నటిగా మాధురి మిలియన్ల హృదయాలను కొల్లగొట్టింది. అయితే జాకీష్రాఫ్ తనకు సైలెంట్ ప్రేమికుడు. తనతో కలిసి నటించాడు. తనను అమితంగా ఆరాధించాడు. ఈ విషయాలన్నీ కాఫీ విత్ కరణ్ షోలో బహిరంగంగా అంగీకరించాడు. మాధురి దీక్షిత్ డాక్టర్ శ్రీరామ్ నేనేను వివాహం చేసుకున్న తర్వాత తాను చాలా బాధపడ్డానని జాకీ ష్రాఫ్ చెప్పినప్పుడు వీక్షకులు చాలా ఆశ్చర్యపోయారు.
నిజానికి మాధురి దీక్షిత్ తన సహనటులతో డేటింగ్‌లు చేసింది. దీనిపై చాలా పుకార్లు, ఊహాగానాలు ఉన్నాయి. 1999లో అక్టోబర్ 17న డాక్టర్ శ్రీరామ్ నేనేను వివాహం చేసుకుని అన్నిటికీ ముగింపు పలికింది. అయితే ఈ పెళ్లితో తాను షాక్ అయ్యానని జాకీ అన్నాడు. మ్యాడీ, సెక్సీయెస్ట్ సైరన్ అని మాధురిని జాకీ పిలుచుకుంటాడు. కాఫీ విత్ కరణ్ సీజన్ 5లో కరణ్ జోహార్‌తో జరిగిన త్రోబ్యాక్ చర్చలో జాకీ తన తండ్రితో కొన్ని వ్యక్తిగత విషయాలను చర్చించడంలో తనకున్న అసౌకర్యం గురించి ఒప్పుకున్నాడు. అదే సమయంలో మాధురి దీక్షిత్ పై తనకు ఉన్న క్రష్ ను బయటపెట్టాడు. మాధురితో తొలి చూపు ప్రేమలో పడిపోయాడట. మొదటి చూపు ప్రేమ జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని మీరు అనుకుంటున్నారా? అని కరణ్ ప్రశ్నించగా, లేదు.. ప్రజలు కాలంతో పాటు ముందుకు సాగుతారు.. కానీ ఆ ప్రేమ ఎప్పటికీ మీతోనే ఉంటుంది.. అని చాలా ప్రాక్టికల్ గా జవాబిచ్చాడు.
తన పెళ్లితో చాలా హృదయాలను చిద్రం చేసిన నటి ఎవరు? అని కరణ్ ప్రశ్నించగా, ఎలాంటి సంకోచం లేకుండా మాడీ.. మాధురి అని చెప్పాడు. మీ హృదయాన్ని కూడా బ్రేక్ చేసిందా? అని ప్రశ్నించగా జాకీ సరదాగా `కోయ్ షాక్?`.. ఇది నా హార్ట్ కి బ్రేక్ కాదు.. `ఉఫ్` అని నిట్టూర్చే ఒక నిట్టూర్పు లాంటిది అని అన్నాడు. జాకీకి మాధురి పై ఉన్న అభిమానం ఈ షో అంతటా స్పష్టంగా కనిపించింది. చాలా ప్రశ్నలకు మాధురి పేరును మాత్రమే అతడు చెప్పాడు.
`సెక్సీయెస్ట్ సైరన్` ఎవరు? అని అడగ్గానే.. అతడు వెంటనే - మాధురి. నాకు అంతకుమించి కనిపించడం లేదు. నన్ను క్షమించండి.. అని జాకీ అన్నాడు. `పక్కింటి అమ్మాయి` గురించి కరణ్ అడిగినప్పుడు కూడా జాకీ సమాధానం మారలేదు `మ్యాడీ` అని అన్నాడు. ఆ తర్వాతి ప్రశ్నకు స్పందనగా, మాధురిని తనకు ఇష్టమైన వ్యక్తి అని పేర్కొన్నాడు.
జాకీ ష్రాఫ్ చివరిసారిగా 2024లో మస్త్ మే రెహ్నే కా, బేబీ జాన్, సింఘం ఎగైన్ వంటి చిత్రాలలో కనిపించింది. మాధురి దీక్షిత్ చివరిగా అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన `భూల్ భూలైయా 3` లో కనిపించింది. 2024 నవంబర్ లో విడుదలైన ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, త్రిప్తి దిమ్రి, మాధురి ధీక్షిత్ తారాగణం. మాధురి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఈ వెటరన్ స్టార్ పలు ప్రాజెక్టులపై దృష్టి సారించింది.