వీడియో: దుబాయ్‌లో జాకీ దుమ్ము దుమారం
ఓవైపు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు ఎదురవుతున్నా దానిని లెక్క చేయక భాయ్ దుబాయ్ లో స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది.
By: Tupaki Desk | 14 Dec 2024 2:13 AM GMTసల్మాన్ ఖాన్ 'డా-బాంగ్' టూర్ కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దుబాయ్‌లో ఉన్నారు. ఓవైపు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు ఎదురవుతున్నా దానిని లెక్క చేయక భాయ్ దుబాయ్ లో స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఆసక్తికరంగా ఈ టూర్‌లో సల్మాన్ తో పాటు అందగత్తెలైన జాక్విలిన్ ఫెర్నాండెజ్, సోనాక్షి సిన్హా, తమన్నా లాంటి భామలు ఉన్నారు. ఆకాశహార్మ్యాల నగరంలో టూర్ రక్తి కట్టిస్తోంది. దుబాయ్ నగరంలో 'అద్భుతమైన రాత్రి.. ఇది ఒక ప్రత్యేక రాత్రి!! ధన్యవాదాలు దుబాయ్' అంటూ జాక్విలిన్ చాలా ఆనందం వ్యక్తం చేసింది. సోనాక్షి సిన్హా, తమన్నా భాటియా, దిశా పటానీ, ప్రభుదేవా, సునీల్ గ్రోవర్, ఆస్తా గిల్, మనీష్ పాల్‌లతో కలిసి జాక్విలిన్ ఈ టూర్ లో ప్రదర్శన ఇవ్వనుంది.
ముఖ్యంగా డా-బాంగ్ ఈవెంట్ కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ధరించిన దుస్తులు యువతరంలో చర్చగా మారాయి. జాకీ ఈ స్పెషల్ డ్రెస్ లో సూపర్‌స్పెషల్ గా కనిపిస్తోంది. స్ట్రాపీ బ్రాలెట్ టాప్ .. డేరింగ్ మినీ స్కర్ట్‌తో జాకీ హృదయాలను కొల్లగొట్టింది. జాక్విలిన్ ఫోటోషూట్ లక్షలాదిగా ఉన్న సోషల్ మీడియా అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద యూట్యూబర్ అయిన మిస్టర్ బీస్ట్‌తో కలిసి పనిచేసిన తర్వాత జాక్విలిన్ కి వరల్డ్ వైడ్ గుర్తింపు దక్కింది. ఆసక్తికరంగా మిస్టర్ బీస్ట్ భారతదేశంలో తన మొదటి వీడియో కోసం జాక్వెలిన్‌ను ఎంచుకున్నాడు. అతడి దాతృత్వ ప్రచారం కోసం జాకీ ప్రచారం నిర్వహిస్తే ప్రపంచవ్యాప్తంగా అది ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తున్నాడు. అందం నటన డ్యాన్సులతో జాక్విలిన్ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం కావడంతో తనను మిస్టర్ బీస్ట్ ఎంపిక చేసుకున్నారు.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కెరీర్ మ్యాటర్‌కి వస్తే... హౌస్‌ఫుల్ 5 , వెల్‌కమ్ టు ది జంగిల్‌లో కనిపించనుంది. ఈ రెండు మల్టీ స్టారర్ ఫ్రాంచైజీ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. సోనూ సూద్‌తో కలిసి `ఫతే`లోను కనిపించనుంది. ఈ చిత్రాన్ని జనవరి 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.