Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ స్ట‌న్నింగ్ లుక్ వైరల్

శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల కొన్ని వివాదాల‌తో ఈ బ్యూటీ పేరు నిరంత‌రం హెడ్ లైన్స్ లోకొచ్చింది.

By:  Tupaki Desk   |   25 Dec 2024 12:30 PM GMT
స్టార్ హీరోయిన్ స్ట‌న్నింగ్ లుక్ వైరల్
X

శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల కొన్ని వివాదాల‌తో ఈ బ్యూటీ పేరు నిరంత‌రం హెడ్ లైన్స్ లోకొచ్చింది. త‌న‌కు 2024 తీపి చేదుగుళిక‌ల మిశ్ర‌మం. మ‌రోవైపు ల‌క్ష‌లాది మంది ఫాలోవ‌ర్స్ తో సోష‌ల్ మీడియాల్లో టాప్ స్టార్ గా వెలిగిపోతోంది జాకీ. ఇంత‌కుముందు ప్ర‌భాస్ `సాహో`లోను జాక్విలిన్ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. అక్ష‌య్ కుమార్ `హౌస్ ఫుల్ 5` చిత్రంలోను ఈ బ్యూటీ న‌టిస్తోంది.

ఇప్పుడు న‌టుడు సోనూసూద్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం `ఫతే`లో న‌టించింది. ఇది సోనూ, జాకీ ఇద్ద‌రికీ కొత్త ఎత్తుల‌కు తీసుకెళ్లే హై ఆక్టేన్ యాక్షన్ చిత్రం అని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సోమవారం ఆవిష్కరించారు. ఇందులో జాక్వెలిన్ అద్భుతమైన ప్రదర్శనతో ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో జాక్విలిన్ ఎన‌ర్జీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ట్రైల‌ర్ లాంచ్‌లో మాట్లాడుతూ, జాక్వెలిన్ తన సహనటుడు, ద‌ర్శ‌కుడు సోనూతో కలిసి పనిచేసిన అనుభవం గురించి వెల్లడించింది. క‌థ విన్న‌ప్పుడే సోనూ కళ్లలో నాపై చాలా నమ్మకం క‌నిపించింది. ద‌ర్శ‌కుడిగా అత‌డి అభిరుచిని చూశాను. అందుకే ఈ చిత్రం చేయాల‌ని భావించాను అని జాక్వెలిన్ గుర్తుచేసుకుంది. చాలా ఫ్రెష్ గా ఉండే పాత్ర‌లో న‌టించాను. ఈ సినిమా క‌థ‌నం చాలా శ‌క్తివంతంగా ఉంటుంద‌ని కూడా జాకీ చెప్పింది. సోనూ సూద్‌తో కలిసి ప‌ని చేయ‌డం అద్భుతమైన శక్తిని ఇచ్చింద‌ని ద‌ర్శ‌కుడిగా అత‌డు చ‌క్క‌ని పాత్రను పోషించాడ‌ని కూడా కితాబిచ్చింది.

సోను దర్శకత్వంలో న‌టించడం చాలా భిన్నమైన అనుభవం. నాలో ఉన్న బెస్ట్ ని బయటకు తీసుకురావడానికి నిబద్ధతతో ప‌ని చేసాడ‌ని జాకీ ప్ర‌శంసించింది. దర్శకుడు అంతగా విశ్వసించినప్పుడు, వారు ఏం కోరుకుంటున్నారో దానిపై స్పష్టత ఉన్నప్పుడు, అది చేసే పనిని సులభతరం చేస్తుంద‌ని జాక్విలిన్ వెల్ల‌డించింది. ఫతేహ్ జనవరి 10న విడుదల కానుంది.