Begin typing your search above and press return to search.

జాక్వెలిజ్ పాప.. ఏమి హాట్ గురు

పేరుకు బాడలీవుడ్ బ్యూటీ అయినా, ఇక్కడి ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే

By:  Tupaki Desk   |   11 Aug 2023 8:25 AM GMT
జాక్వెలిజ్ పాప.. ఏమి హాట్ గురు
X

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పరిచయం అవసరం లేని పేరు. పేరుకు బాడలీవుడ్ బ్యూటీ అయినా, ఇక్కడి ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. తన హాట్ ఫోజులు, ఐటెం సాంగులతో క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో జాక్వెలిన్ డైరెక్ట్ గా సినిమా చేసింది లేదు. కానీ, ఐటెం సాంగ్స్ లో మెరిసింది. దీంతో, ఇక్కడ కూడా ఆమె ఫ్యాన్స్ ని సంపాదించుకోగలిగింది.


జాక్వెలిన్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేసి, అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి కేవలం ఇన్ స్టాగ్రామ్ లో 67.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన అభిమానులను అలరించేందుకు ఆమె వింత ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి హాట్ పోజులతో అదరగొడుతుంది. ఒక్కోసారి వింత ఫోజులతో బెదరగొడుతూ ఉంటుంది.

ఈ సారి చాలా క్యాజువల్ లుక్ లో తన ఫోటోలు షేర్ చేసింది. మినీ స్కర్ట్, క్లీవేజ్ టాప్ ధరించింది. చాలా క్యాజువల్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. కానీ, ఆ డ్రెస్ లోనూ ఆమె చాలా హాట్ గా కనిపిస్తుండటం విశేషం. తలకు హ్యాట్ పెట్టొకొని, మెడలో సింపుల్ చైన్ ధరించింది. హెయిర్ లూస్ గా వదిలేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేస్తున్నాయి.

ఈ బ్యూటీ సాహోలో బ్యాడ్ బాయ్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. ప్రభాస్ పక్కన చాలా అందంగా కనపడింది. కన్నడ సినిమా 'విక్రాంత్ రోణా'లోనూ స్పెషల్ అపియరెన్స్ కు ఛాన్స్ దక్కించుకుంది. 'రా రా రక్కమ్మ' అనే సాంగ్ ఎంతలా సెన్సేషనల్ అయ్యిందో తెలిసిందే. స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాతో అలరిస్తోంది. లీడ్ గానే కాకుండా కీలక పాత్రల్లోనూ నటిస్తూ మెపిస్తోంది.

ఇక, ఈ బ్యూటీ సినిమాలతో సంబంధం లేకుండా, ఓ వివాదంలో చిక్కుకుంది. సుఖేష్ చంద్రశేఖర్ చేసిన రూ. 200 కోట్ల రూపాయల మోసం కేసులో జాక్వెలిన్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు విచారణను ఎదుర్కొంది. కాగా, ఆమె ఇటీవల ఓ లగ్గజరీ ఇల్లు కొనగా, దానిని కూడా సుఖేష్ కొనుగోలు చేశాడు అంటూ నెటిజన్లు కామెంట్స చేయడం విశేషం.