Begin typing your search above and press return to search.

న‌టి జాక్విలిన్ త‌ల్లి మృతి.. అంత్య‌క్రియ‌ల్లో తండ్రి ఎల్రాయ్

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఈ ఆదివారం ముంబై లీలావ‌తి ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచారు.

By:  Tupaki Desk   |   6 April 2025 12:15 PM
న‌టి జాక్విలిన్ త‌ల్లి మృతి.. అంత్య‌క్రియ‌ల్లో తండ్రి ఎల్రాయ్
X

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఈ ఆదివారం ముంబై లీలావ‌తి ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. జాక్వెలిన్ , ఆమె తండ్రి ఎల్రాయ్ ఫెర్నాండెజ్ ముందుగా లీలావతి ఆస్ప‌త్రికి చేరుకోగా, అందుకు సంబంధించిన విజువ‌ల్స్ వైర‌ల్ అయ్యాయి. భ‌వంతి మెట్లు దిగేప్పుడు జాకీ తండ్రి ఎల్రాయ్ పూర్తిగా నిస్స‌హాయ స్థితిలో క‌నిపించారు.

ఇటీవల జాక్వెలిన్ తన తల్లి అనారోగ్యం కారణంగా గౌహతిలో జరిగిన ఐపిఎల్ వేడుకలో ప్రదర్శన ఇవ్వలేక‌పోయారు. కిమ్ ఐసియులో కోలుకుంటోందని, డాక్టర్ రిపోర్ట్ కోసం వేచి ఉన్నారని జాక్విలిన్ సన్నిహిత వర్గాలు వెల్ల‌డించాయి.

ఈరోజు తెల్లవారుజామున, జాక్వెలిన్ , ఆమె తండ్రి ఎల్రాయ్ ఇరువురూ కిమ్ ఫెర్నాండెజ్ అంత్యక్రియలను జ‌రిపించారు. నటుడు సోను సూద్ కూడా తన `ఫతే` సహనటి అయిన జాక్విలిన్ కోసం ఈ అంత్యక్రియ‌ల్లో పాల్గొన్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... జాక్వెలిన్ చివరిసారిగా సోను సూద్ తో కలిసి `ఫతే` చిత్రంలో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. ఈ సినిమాకి సోను స్వ‌యంగా దర్శకత్వం వ‌హించారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో నిజ జీవిత సైబర్ క్రైమ్ సంఘటనల నుండి ప్రేరణ పొందిన యాక్షన్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది.