Begin typing your search above and press return to search.

పాపం నటి జాక్వెలిన్ పెర్నాండేజ్ కి ఎన్ని కష్ఠాలు!

బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ పెర్నాండేజ్ అంటే ఐపీఎల్ కి ఓవైబ్ తీసుకొచ్చే న‌టి. అమ్మ‌డు స్టేడియంలో క‌నిపించిందంటే? కుర్రాళ్ల‌లో కాక‌లు మొద‌లైపోతాయి.

By:  Tupaki Desk   |   26 March 2025 9:32 AM
పాపం నటి జాక్వెలిన్ పెర్నాండేజ్ కి ఎన్ని కష్ఠాలు!
X

బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ పెర్నాండేజ్ అంటే ఐపీఎల్ కి ఓవైబ్ తీసుకొచ్చే న‌టి. అమ్మ‌డు స్టేడియంలో క‌నిపించిందంటే? కుర్రాళ్ల‌లో కాక‌లు మొద‌లైపోతాయి. అలాంటి బ్యూటీ కోల్ క‌త్తా-రాజ‌స్థాన్ మ్యాచ్ కి హాజ‌ర‌య్యే అవ‌కాశం లేదు. గౌహ‌తి వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌రుగుతుంది. కానీ జాకీ మాత్రం సారీ చెప్పేసింది. మ‌రెందుకు స్కిప్ కొడుతున్న‌ట్లు అంటే? జాక్వెలిన్ త‌ల్లి కిమ్ కు సోమవారం గుండెపోటు రావ‌డంతో ప్ర‌యివేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ప్ర‌స్తుతం కిమ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతానికి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది. కానీ ఆసుప త్రిలో జాక్వెలిన్ ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డ‌టంతో మ్యాచ్ కు హాజ‌ర‌వ్వ‌ద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే స‌ల్మాన్ ఖాన్ కూడా జాకీ త‌ల్లిని ప‌రామ‌ర్శించి ఆరోగ్య వివ‌రాలు అడిగి తెలుసుకున్న‌ట్లు స‌మాచారం. జాక్వెలిన్ శ్రీలంక నుంచి దిగుమ‌తి అయిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో న‌టిగా త‌నకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తిం పును ద‌క్కించుకుంది.

జాకీతో పాటు త‌ల్లి కూడా ముంబైలోనే ఉంటుంది. అప్పుడ‌ప్పుడు ఆమెతో పాటు సినిమా షూటింగ్ ల‌కు కూడా హాజ‌ర‌వుతుంటారు. కుమార్తె అంటే కిమ్ కి ఎంతో ఇష్టం. ప్ర‌స్తుతం జాకీ ఆసుప‌త్రిలో ఉండా త‌ల్లికి సేవ‌లందిస్తుంది. ఆమె తిరిగి కోలుకునే వ‌ర‌కూ జాకీ సినిమా వ్యాపకాలేవి పెట్టుకునే ప‌రిస్థితి లేదు. ఆ మ‌ధ్య మనీలాండ‌రింగ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌డంతో జాకీ కొన్ని సినిమా అవ‌కాశాలు కూడా కోల్పోయిన సంగ‌తి తెలిసిందే.

`హ‌రి హ‌రవీర‌మ‌ల్లు` చిత్రంలో ఈ బ్యూటీకే తొలుత అవ‌కాశం వ‌చ్చింది. కానీ కేసులో ఇరుక్కోవ‌డం తో సినిమా నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వ‌చ్చింది. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమా అవ‌కాశాల‌ను కోల్పోయింది. ప్ర‌స్తుతం అమ్మ‌డు అవ‌కాశాల ప‌రంగా తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మునుప‌టిలో మ‌ళ్లీ న‌టిగా బిజీ అవుతోంది.