Begin typing your search above and press return to search.

ముద్దుగుమ్మ కెరీర్ ఖతం అయినట్లేనా...?

అక్కడ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా నిలిచిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో నటించింది.

By:  Tupaki Desk   |   19 Feb 2025 12:30 AM GMT
ముద్దుగుమ్మ కెరీర్ ఖతం అయినట్లేనా...?
X

శ్రీలంక నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హిందీ రియాల్టీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది. శ్రీలంకలో టెలివిజన్ రిపోర్టర్‌గా పని చేసిన జాక్వెలిన్‌ తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. అక్కడ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా నిలిచిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. కానీ ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి సినిమాల జోరు తగ్గింది. ముఖ్యంగా ఈమెకు వరుస ఫ్లాప్స్ పడటంతో పాటు, కేసులు చుట్టు ముట్టడంతో కెరీర్‌ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. జాక్వెలిన్‌ కెరీర్ ఖతమేనా అనే చర్చ ప్రారంభం అయింది.

ఈ మధ్య కాలంలో జాక్వెలిన్‌ ఎక్కువగా సోషల్‌ మీడియాలో కనిపిస్తుంది. సినిమాల్లో అడపా దడపా సినిమాలు చేసినా అవి ప్రత్యేక పాత్రలు, ప్రత్యేక పాటలు మాత్రమే. దాంతో ఆమె కెరీర్‌లో తిరిగి పుంజుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతుంది. గత ఏడాదిలో ఈమె చేసిన సినిమాలు తక్కువే ఉన్నాయి. అవి కూడా ఈమెకి పెద్దగా ఆఫర్లు తెచ్చి పెట్టే పరిస్థితి లేదు. ఆ కారణంగానే జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఈ ఏడాదిలో చేసే సినిమాలు ఎన్ని, ఆమెకు దక్కే సక్సెస్‌లు ఎన్ని అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. సాధారణంగా ఒక హీరోయిన్‌ వరుసగా ఫెయిల్యూర్స్‌ను చవిచూస్తే కెరీర్‌ పరంగా డౌన్‌ ఫాల్‌ మొదలు అయినట్లే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

2009లో మోడలింగ్‌తో కెరీర్‌ను ఆరంభించిన ఈ అమ్మడు సుజోష్‌ ఘోష్‌ యొక్క ఫాంటసీ సినిమా అలాడిన్‌ కోసం ఆడిషన్స్‌కి వెళ్లింది. అక్కడ మొదలైన జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ సినీ ప్రస్థానం కంటిన్యూ అవుతూ వచ్చింది. దాదాపు దశాబ్ద కాలం పాటు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఈ అమ్మడు ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించింది. పలు అవార్డులను రివార్డులను అందుకుంది. అంతే కాకుండా ఆ సమయంలోనే ఎన్నో షోల్లోనూ జాక్వెలిన్‌ కనిపించి మెప్పించింది. ఈమె నటించిన బాలీవుడ్‌ కిక్ 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అత్యధిక వసూళ్లు రాబట్టింది.

హౌస్‌ ఫుల్‌ 3తో 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఆ తర్వాత కూడా పలు సినిమాలతో సక్సెస్‌లను సొంతం చేసుకుంది. అయితే గత నాలుగు అయిదు సంవత్సరాలుగా ఈమె కెరీర్‌లో సాలిడ్‌ సక్సెస్‌ పడలేదు. ఐటెం సాంగ్స్ చేసినా పెద్దగా ప్రతిఫలం దక్కలేదు. దాంతో ఈ అమ్మడికి సినిమాల్లో ఆఫర్లు తగ్గాయి. ముందు ముందు ఈమెకు ఐటెం సాంగ్స్‌లోనూ ఆఫర్లు వచ్చే పరిస్థితి లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మళ్లీ బుల్లి తెరపై ఈమె తన ప్రస్థానం మొదలు పెట్టాల్సి ఉంటుందేమో అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాదిలో కనీసం ఒక్కటి లేదా రెండు సినిమాల్లో అయినా హీరోయిన్‌గా నటించి హిట్‌ కొడితేనే జాక్వెలిన్‌ కెరీర్‌ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కెరీర్‌ ఖతం అయినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.