సుకేష్ బెదిరిస్తున్నాడు.. కోర్టునాశ్రయించిన జాకీ
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చివరిసారిగా అక్షయ్ కుమార్‌తో కలిసి రామసేతులో కనిపించింది
By: Tupaki Desk | 20 Dec 2023 4:44 PM GMTబాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చివరిసారిగా అక్షయ్ కుమార్‌తో కలిసి రామసేతులో కనిపించింది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కుంభకోణం కేసులో కాన్ మ్యాన్ సుకేష్ చంద్రశేఖర్ తో జాకీ స్నేహం కొత్త చిక్కుల్ని తెచ్చింది. జాకీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలుమార్లు ప్రశ్నించింది. అదే క్రమంలో సుఖేష్ తో జాక్విలిన్ స్నేహం ప్రేమాయణం గురించి చాలా విషయాలు బయటికి వచ్చాయి. కానీ ఇప్పుడు సుఖేష్ తనను బెదిరిస్తున్నాడని, రక్షణ కావాలంటూ జాక్విలిన్ కోర్టును ఆశ్రయించడం సంచలనమైంది.
సుకేష్ జాక్వెలిన్‌కి జైలు నుంచే చాలా లేఖలు పంపుతున్నాడు. అందులో అతడు ఆమెను ఎంతగా మిస్ అవుతున్నాడో, ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిపాడు. ఇటీవలి లేఖలో అతడు సెలవు సీజన్‌లో తనతో ఉండటాన్ని ఎంతగా మిస్ అవుతున్నాడో రాశాడు. జాకీకి ఇష్టమైన వైన్ ని సేవిస్తూ తనతో కలిసి ఉండాలని కోరుకున్నాడు. పాత కాలంలాగే నీతో ఉంటాను తేనెటీగ అని వ్యాఖ్యానించాడు. తేనెటీగ వంటి మారుపేర్లతో జాకీని పిలుస్తున్నాడు. దేవదూత, సీతాకోకచిలుక అని ప్రేమగా పిలుస్తున్నాడు.
దోపిడీ డబ్బుతో కొనుగోలు చేసిన విలాసవంతమైన వస్తువులు, ఖరీదైన బహుమతులను జాక్వెలిన్ అతడి నుంచి అందుకుందని ఆరోపణలున్నాయి. అయితే ఈ స్కామ్‌తో తనకు ఎటువంటి ప్రమేయం లేదని ఖండించింది. సుకేష్ తనను దురుద్ధేశపూర్వకంగా లక్ష్యం చేసుకున్నట్లు తెలిపింది. దోపిడీ డబ్బుతో కొన్న బహుమతులు తనకు అందలేదని, సుకేష్ వల్ల తన జీవితం, కెరీర్ నాశనమైందని కోర్టుకు తెలిపింది.
మునుపటి ఇంటర్వ్యూలో జాక్వెలిన్ మాట్లాడుతూ, ''సుకేష్ చంద్రశేఖర్ పెద్ద అభిమానినని, మీరు దక్షిణ భారతదేశంలో కూడా సినిమాలు చేయాలని చెప్పాడు. సన్ టీవీ యజమానిగా, వారు చాలా ప్రాజెక్ట్‌లను లైన్‌లో ఉన్నట్టు తెలిపాడు. సౌత్ ఇండియన్ సినిమాల్లో కలిసి పనిచేయడానికి ప్రయత్నించాలన్నాడు. సుకేష్ నన్ను తప్పుదోవ పట్టించాడు. నా కెరీర్ నా జీవనోపాధిని నాశనం చేశాడు. చంద్రశేఖర్ కార్యకలాపాలు, నేపథ్యం గురించి పింకీ ఇరానీకి తెలుసు. కానీ ఆమె ఈ విషయాన్ని నాకు ఎప్పుడూ వెల్లడించలేదు'' అని ఆవేదన చెందింది.