Begin typing your search above and press return to search.

దారికి తెచ్చుకునేందుకే ఫోటోలు తీశాడట!.. ఒప్పుకున్న 'పుష్ప' కేశవ?

'పుష్ప' కేశవగా సుపరిచితుడు నటుడు జగదీశ్ అలియాస్ బండారు ప్రతాప్ తాను చేసిన నేరాన్ని ఒప్పేసుకున్నాడు

By:  Tupaki Desk   |   17 Dec 2023 5:02 AM GMT
దారికి తెచ్చుకునేందుకే ఫోటోలు తీశాడట!.. ఒప్పుకున్న పుష్ప కేశవ?
X

'పుష్ప' కేశవగా సుపరిచితుడు నటుడు జగదీశ్ అలియాస్ బండారు ప్రతాప్ తాను చేసిన నేరాన్ని ఒప్పేసుకున్నాడు అని అంటున్నారు దీని మీద నిజం ఎంత అనేది పోలీస్ ప్రెస్ మీట్ లోనే తెలుస్తుంది. గతంలో తనతో సన్నిహితంగా ఉన్న అమ్మాయి వేరే వారికి దగ్గర కావటాన్ని జీర్ణించుకోలేని అతడు.. ఆమెను తన దారికి తెచ్చుకునేందుకే తాను ఆమె ఫోటోల్ని తీసి బెదిరింపులకు పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు అని అంటున్నారు . జూనియర్ ఆర్టిస్టుగా పని చేసే బండారు ప్రతాప్.. 'పుష్ప' మూవీతో ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప మూవీ మొత్తాన్ని తన మాటలతోనడిపించే కేశవ పాత్రతో ఒక్కసారిగా అతడికి ఫేం వచ్చింది.

అసలు ఏమి జరిగింది అని జరుగుతున్న ప్రచారం ప్రకారం ....ఐదేళ్ల క్రితం సినీ అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చిన అతనికి ఒక యువతితో పరిచయమైంది. కొంతకాలానికి ప్రేమగా మారి.. ఇరువురు శారీరకంగా దగ్గరయ్యారు. పుష్ప మూవీతో జగదీశ్ కు పేరు రావటంతో అతని ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. దీంతో.. ఈ తీరు నచ్చని ఆమె అతడికి దూరంగా ఉండసాగింది. ఈ క్రమంలో ఆమెకు వేరే వారితో పరిచయమై.. వారిద్దరు దగ్గరయ్యారు. ఇది తెలిసిన జగదీవ్ భరించలేకపోయాడు. దూరమైన యువతిని దగ్గరకు తెచ్చుకోవాలని భావించాడు.

ఇందులో భాగంగా గత నెలలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతి ఇంటికి వెళ్లాడు. ఆ టైంలో సదరు యువకుడితో సన్నిహితంగా ఉన్న యువతి ఫోటోలు తీసి తన దారిన తాను వెళ్లిపోయాడు. ఆ తర్వాత నుంచి ఆమెకు ఆ ఫోటోల్ని పంపి.. తాను చెప్పినట్లుగా వినకపోతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీన్ని అవమానంగా భావించిన సదరు యువతి.. నవంబరు 29న ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

తన కుమార్తె ఆత్మహత్యకు కారణం.. జగదీశ్ బెదిరింపులే అన్న విషయాన్ని గుర్తించిన యువతి తండ్రి పోలీసుల్ని ఆశ్రయించి.. జరిగిన వివరాల్ని తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బ్లాక్ మొయిలింగ్.. బెదిరింపులకు దిగటం లాంటి నేరారోపణలతో జగదీశ్ ను అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. తాజాగా రెండు రోజుల కస్టడీలోకి తీసుకొని.. అతడ్ని విచారించిన నేపథ్యంలో తాను చేసిన నేరాన్నిఒప్పుకున్నట్లుగా చెప్పినట్లు సమాచారం. కస్టడీ గడువు ముగియటంతో అతడ్ని తిరిగి రిమాండ్ కు పంపేశారు పంజాగుట్ట పోలీసులు.