ఆ హీరో నుంచి ప్రాణ హాని ఉందంటూ లాయర్ ఫిర్యాదు!
దర్శన్ అరెస్ట్ అయిన నాటి నుంచి బెయిల్ కోసం అతడి భార్య చేయని ప్రయత్నం లేదు.
By: Tupaki Desk | 6 Nov 2024 6:51 AM GMTకన్నడ నటుడు దర్శన్ ఇటీవలే మధ్యంతర బెయిల్ తో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా కోర్టు ఆరువారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చి ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించు కుంటున్నాడు. ప్రస్తుతం దర్శన్ ఆసుపత్రిలో ఉండే వైద్యం పొందుతున్నాడు. ఈ బెయిల్ కోసం దర్శన్ తరుపు లాయర్లు ఎంతో శ్రమిస్తే గానీ సాధ్యం కాలేదు. దర్శన్ అరెస్ట్ అయిన నాటి నుంచి బెయిల్ కోసం అతడి భార్య చేయని ప్రయత్నం లేదు.
రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఈనేపథ్యంలో జైల్లో ఉండగానే అనారోగ్యానికి గురికావడం, వెన్నునొప్పి రావడంతో కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తాజాగా దర్శన్ పై మరో కన్నడ టీవీ న టుడు, బిగ్ బాస్ ఫేం, లాయర్ జగదీష్ సంచలన ఆరోపణలు చేసాడు. దర్శన్, అతడి అభిమానుల నుంచి తనకి, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ప్రకారం, నటుడికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు దర్శన్ అభిమానులు జగదీష్ పేరును ఏకవచనంతో దూషించినట్లు సమాచారం.
అక్కడితో అగకుండా తనని, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులకు సైతం పాల్పడినట్లు దీనికి సంబంధించి తన కుటుంబానికి 1000 ఫోన్ కాల్స్ కూడా వెళ్లినట్లు జగదీష్ ఆరోపిస్తున్నాడు. అభిమానులు బెదిరించినా దీని వెనుక ఉన్నది దర్శన్ అని జగదీష్ ఆరోపించాడు. దర్శన్ ఇప్పుడు బెయిల్ పై బయట ఉండటంతో తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నాడు.
మరి లాయర్ ఆరోపణలు, ఆవేదనపై ప్రతి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. దర్శన్ కి నవంబర్ 1 జైలు నుంచి బయటకు వచ్చాడు. అనంతరం నేరుగా ఇంటికెళ్లి భార్య, పిల్లలను కలిసాడు.అనంతరం కుమారుడు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. అటుపై కొంత సమయాన్ని కుటుంబంతో గడిపి ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది.