నందులు అర్హులకు ఇవ్వాలని జగన్ అన్నారు!-పోసాని
తాజాగా మీడియా సమావేశంలో పోసాని నంది పురస్కారాల సరళి గురించి ఆవేశంగా మాట్లాడారు
By: Tupaki Desk | 28 Dec 2023 6:18 PM GMTనంది అవార్డుల ఉత్సవాలు ఒకప్పుడు కన్నుల పండుగగా సాగేవి. కానీ రాష్ట్రం ముక్కలయ్యాక అవార్డుల కళ పూర్తిగా తప్పింది. కొన్నాళ్ల పాటు నంది అవార్డులు సరిగా ఇవ్వలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డులు అందజేయడానికి రంగం సిద్ధమవుతోంది.
తాజాగా మీడియా సమావేశంలో పోసాని నంది పురస్కారాల సరళి గురించి ఆవేశంగా మాట్లాడారు. నంది అవార్డులు చుట్టాలు పక్కాలు బంధువులకు ఇవ్వమని అడిగితే చెప్పుతో కొట్టండి అని అన్నారు. పోసాని మాట్లాడుతూ-``ఇంతకుముందు కళాకారులు నిరాశగా ఉండేవారు. ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందని, ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవుతాడని, లెజెండ్ ఇన్వాల్వ్ అయ్యాడని చెబుతుంటారు. మన పార్టీకి సర్వీస్ చేస్తున్నాడు ఈయన్ని చూడండి ... ఇలాంటివాళ్ల రికమండేషన్లు ఉంటాయని కళాకారులే కాదు గతంలో నందులకు జడ్జిలుగా ఉన్నవారు కూడా చెబుతున్నారు. అందుకే నన్ను కూడా వీళ్లు నమ్మేందుకు ఆస్కారం లేదు. ఒకరికి ఇవ్వాల్సిన అవార్డును ఇంకొకరికి ఇచ్చిన సందర్భాలున్నాయని గతంలో అవార్డులు ఇచ్చిన వారు చెప్పారు.
నేను ఇప్పుడు ఎన్ని చెప్పినా కానీ నమ్మే పరిస్థితి లేదు. ఈయన మంచోడేనా? అని ఇతరులకు డౌట్లు వస్తాయి. అయితే నిజాయితీగా అవార్డులు ఇస్తుంటే, అవార్డులకు మావాడి పేరు రాయి అని అడిగే పెద్ద మనుషులున్నారని పోసాని కి సినీపెద్దలు చెప్పారట. కానీ ఏపీ సీఎం అలా కాదు. నంది అవార్డుకి ఎవరు అర్హుడో ఆయనకు అవార్డు ఇవ్వండి అని సీఎం జగన్ చెప్పారు. మా కజిన్ అర్హుడేమో చూడండి అని నేను అడిగితే నన్ను చెప్పుతో కొట్టండి.
విద్యావంతులైన 27 మంది జడ్జిలు జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అంతకుముందు నంది అవార్డుల్లో ఎప్పుడూ వివాదాలు తలెత్తాయి. కానీ ఈసారి జడ్జిలు ఎంతో నిజాయితీగా ఎంపికలు చేసారు. వివాదాలు లేకుండా వారు సినిమాల్ని ఎంపిక చేసారు. అసలైన అర్హుల గురించి వీరంతా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. వారికి అవార్డులను అందజేస్తారు.. అని పోసాని అన్నారు. ఎన్టీఆర్ రంగ స్థల పురస్కారం, వైయస్సార్ రంగస్థల పురస్కారం సరైన వారికి ఇవ్వాలి. 27 మంది జడ్జిలు బెస్ట్ అనిపించే కళాకారుడికి ఈ పురస్కారాల్ని అందజేస్తారు. కలెక్టర్ ఆఫీస్, కలెక్టర్ గారి హాల్లో కూచుని ఎవరెవరికి ఇవ్వాలో కూడా నిర్ణయించారు.. అని తెలిపారు.