Begin typing your search above and press return to search.

జ‌గ్గూ భాయ్ అంటే ప‌డి చ‌స్తున్న జ‌ప‌నీ ఫ్యాన్స్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు స్టార్ల‌కు ఫాలోయింగ్ అసాధార‌ణంగా పెరుగుతోంది. ప్ర‌స్తుత పాన్ ఇండియ‌న్ ట్రెండ్ లో ఇది కొత్త ప‌రిణామం.

By:  Tupaki Desk   |   22 Jan 2025 4:46 PM GMT
జ‌గ్గూ భాయ్ అంటే ప‌డి చ‌స్తున్న జ‌ప‌నీ ఫ్యాన్స్
X

ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు స్టార్ల‌కు ఫాలోయింగ్ అసాధార‌ణంగా పెరుగుతోంది. ప్ర‌స్తుత పాన్ ఇండియ‌న్ ట్రెండ్ లో ఇది కొత్త ప‌రిణామం. రాజ‌మౌళి, సుకుమార్, ప్ర‌శాంత్ నీల్ వంటి పాన్ ఇండియా డైరెక్ట‌ర్ల సినిమాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న స్టార్లు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. అంతేకాదు.. వీళ్ల‌కు ఫాలోయింగ్ అసాధార‌ణంగా పెరుగుతోంది.

పాన్ ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్‌కి భార‌త‌దేశం స‌హా విదేశాల్లో, ముఖ్యంగా జ‌పాన్‌లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలిసిన‌దే. అలాగే సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబుకు కూడా ఫాలోయింగ్ త‌క్కువేమీ కాదు. అస‌లు జ‌గ‌ప‌తిపై జ‌పనీ అభిమానుల ప్రేమ ఎలాంటిదో ఇప్పుడు స్వ‌యంగా ఆయ‌నే విజువ‌ల్‌గా ప్రూఫ్‌లు చూపించాడు.

హీరోగా, విల‌న్‌గా అత‌డి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు కేవ‌లం భార‌తీయ‌లే కాదు జ‌ప‌నీయులు కూడా గొప్ప ఫ్యాన్స్ గా మారారు. జగపతి బాబు తాజాగా యూట్యూబ్‌లో ఒక హార్ట్ టచింగ్ వీడియోను షేర్ చేసారు. ఇందులో జ‌ప‌నీ అభిమానుల ప్రేమ ఆద‌రాభిమానాలు ఎలా ఉంటాయో త‌న మాట‌ల్లో వెల్ల‌డించారు. త‌న జ‌ప‌నీ అభిమానిని సోష‌ల్ మీడియాలో 10ల‌క్ష‌ల మంది అనుస‌రిస్తున్న విష‌యాన్ని జ‌గ‌ప‌తి వెల్ల‌డించారు. ఇక త‌న డైహార్డ్ మ‌హిళా జ‌ప‌నీ ఫ్యాన్ యుజుకి గురించి జ‌గ‌ప‌తి చాలా విష‌యాలు చెప్పారు. `నా వేలాది మంది అభిమానుల ఫ్రెండ్ యుజుకి` అంటూ వీడియ‌ను షేర్ చేసారు. యుజుకి జపాన్ నుండి ప్రయాణించి ఒక మిలియన్ ఇన్‌స్టా ఫాలోవర్లను చేరుకున్న గొప్ప‌ మైలురాయి వేడుక‌ల గురించి జ‌గ‌ప‌తి ప్ర‌స్థావించారు.

జ‌ప‌నీ ఫ్యాన్స్ జ‌గ‌ప‌తిబాబును క‌లిసేందుకు భార‌త‌దేశానికి, హైద‌రాబాద్ కి వ‌చ్చారు. అంతేకాదు యుజికి త‌న‌కు అద్భుత‌మైన బ‌హుమ‌తులు కూడా తెచ్చింది. అలాగే త‌న స్నేహితులు ఇచ్చిన గిఫ్టుల‌ను కూడా అందించింది. వాట‌న్నిటినీ జ‌గ‌ప‌తి ఒక్కొక్క‌టిగా చూపిస్తూ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. వారి ప్రేమ అభిమానాల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌ను ప్ర‌తియేటా జ‌పాన్ లో అభిమానులు సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఎంతో ఉద్వేగానికి గురి చేస్తోందిన అన్నారు. ఈసారి బ‌ర్త్ డే వేడుక‌ల కోసం త‌న‌ను జ‌పాన్ కు ఆహ్వానించార‌ని, కానీ తాను బిజీ షెడ్యూళ్ల కార‌ణంగా వెళ్ల‌లేక‌పోయాన‌ని జ‌గ‌ప‌తి బాబు తెలిపారు.

ఇటీవ‌ల జ‌గ‌ప‌తిబాబు పాన్ ఇండియ‌న్ చిత్రాల్లో న‌టిస్తున్నారు. గుంటూరు కారం, ది ఫ్యామిలీ స్టార్, సింబా, మిస్టర్ బచ్చన్, `పుష్ప 2: ది రూల్` వంటి బ్లాక్ బస్టర్ హిట్లలో నటించాడు. త‌నదైన‌ విల‌క్ష‌ణ న‌ట‌న‌, ఆహార్యంతో దేశ విదేశాల్లో అభిమానుల‌కు క‌నెక్ట‌య్యాడు. మునుముందు ప‌లు పాన్ ఇండియ‌న్ చిత్రాల‌తోను ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడు. త‌న అభిమానుల‌ను గౌర‌విస్తూ జ‌గ‌ప‌తి బావు వారు ఇచ్చిన కానుక‌లను ఇలా లైవ్ లో చూపిస్తూ ప్రేమ‌ను చాటుకోవ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.