ఎంత వెదవలా చేస్తే అన్ని అవార్డులొస్తాయి!
దానికి 'ఎంత వెదవలా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి' అనే క్యాప్షన్ ఇచ్చారు.
By: Tupaki Desk | 22 Oct 2024 2:03 PM GMTజగపతి బాబు అలియాస్ జగ్గుభాయ్ స్ట్రెయిట్ ఫార్వార్డ్ మనస్తత్వం గలవారు. తాను ఏది చెప్పాలనుకున్నా? ఒపెన్ గా మాట్లాడేస్తారు. ఎలాంటి దాపరికాలు ఉండవు. తన వృత్తి..వ్యక్తిగత విషయాల్లో తన డేరింగ్ నెస్ ఎన్నోసార్లు బయట పడింది. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దానికి 'ఎంత వెదవలా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి' అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే అవార్డుల విషయంలో ఆయన ఎందుకిలా స్పందించారు? అన్నది ఆసక్తికరం.
ఆయన సరదాగా? అన్నా దాని వెనుక ఇంకేదైనా అర్దం ఉందా? అన్న కోణంలో నెట్టింట చర్చ సాగుతోంది. ఐపా వేడుకల్లో భాగంగా 'కాటేరా' సినిమాలో జగపతి బాబు విలన్ పాత్రకు గానూ ఈ అవార్డు వచ్చింది. బెస్ట్ పెర్పార్మెన్స్ ఇన్ నెగిటివ్ రోల్ విభాగంలో ఈ గుర్తింపు దక్కింది. అవార్డు అందుకునేందుకు దుబాయ్ వెళ్లిన సమయంలో అక్కడ మాట్లాడిన వీడియో అది. ఆ వీడియోకే ఇప్పుడు క్యాప్షన్ ఇచ్చి బయటకు వదిలారు.
దీంతో నెటి జనులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ' మీరు అద్భుతంగా ఉన్నారు. మీ చర్యలకు సమాధానం లేదు' అంటూ ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు. 'నువ్వు మామూలు వాడివి కాదు జగ్గుభాయ్..మంచిగా చేస్తే ఈ సమాజం ఒప్పుకోదు అని మరొకరు ట్వీట్ చేసారు. ఇక జగపతి బాబు గతంలో క్యాసినోలో దిగిన తన ఫోటోను తానే ఉద్దేశించి ' సిగ్గు శరం లేని వాడిని. దిగులు పడను. మీరు చెబితే పడతాను' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.
ఇతరుల విషయంలో ఆయనెప్పుడు తలదూర్చరు. 'తనని తానే దూషించుకుంటారు..తనని తానే పొగుడు కుంటారు'. ఇదే జగ్గుభాయ్ లో స్పెషాల్టీ. వివాదాలకు ఆయన ఎప్పుడూ దూరంగా ఉంటారు. ఎలాంటి కాంట్ర వర్శీలపైనా ఆయన ఎప్పుడు స్పందించరు. నటుడిగా ఆయన పని..ఆయన గోల ఆయనది తప్ప! ఇంకెలాంటి వాటితోనూ ఆయనకు సంబంధం లేదు.